Wednesday, 29 July 2026 09:13:58 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గణేష్ మండపాలకు పోలీసు వారి అనుమతి తప్పనిసరి... - ఎస్ఐ సంతోష్

Date : 16 September 2023 05:23 AM Views : 359

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : లక్ష్మిదెవిపల్లి  : మండల పరిధిలోని గణేష్ మండపాలకు పోలీస్ అనుమతులు తప్పని సరని లక్ష్మీదేవిపల్లి ఎస్ఐ పి సంతోష్  తెలిపారు. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ జి అదేశాల మేరకు నియమ నిబంధనలు, తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహ ప్రతిష్ఠ, పందిళ్ళు/మండపాలు ఏర్పాటు చేసుకోవడానికి ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులతో ఒకకమిటీగా ఏర్పడి వారి వివరాలు  పోలీస్ స్టేషన్లో తెలియజేయాలన్నారు. ప్రైవేట్ స్థలాలలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే సంబంధిత స్థలయజమాని అనుమతి తప్పనిసరిగా తీసుకొని, పోలీస్ అనుమతి లేకుండా విగ్రహలు ఏర్పాట్లు చేయరాదన్నరు. పోలీస్ శాఖతో పాటు ఫైర్, విద్యుత్ శాఖల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఆయా విభాగాలు సూచించిన నియమ నిబంధనలకు అనుగుణంగా పందిళ్ళు/మండపాలువద్ద ముందస్తుగా ఇసుక, నీళ్ళను ఏర్పాటు చేయాలన్నారు. పందిళ్లు/మండపాలలో అగ్ని ప్రమాదాలు జరుగకుండా జాగ్రతలు తీసుకోవాలని, విద్యుత్ వైర్లను, ప్రకాశవంతమైన లైట్ల వినియోగంలో తగు జాగ్రతలు వహించాలన్నారు. ఎలక్ట్రిక్ షార్ట్ సర్య్కూట్ జరుగకుండా వైరింగ్ జాగ్రత్తగా చేయించుకోవాలన్నారు.గణేష్ ప్రతిమల ఎత్తు, బరువు, ఉత్సవం నిర్వహించే రోజుల వివరాలు, నిమజ్జనం చేసేతేదీని, సమయం, నిమజ్జన మార్గం, విగ్రహ నిమజ్జనానికి ఉపయోగించే వాహన వివరాలను విధిగా తెలియజేయాలన్నారు. పందిళ్ళు/మండపాలు వద్ద శబ్ధకాలుష్య నింబంధనలు ప్రకారం మాత్రమే స్పీకర్లను ఉపయోగించాలని, ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వాడాలన్నారు. రాత్రి వేళల్లో మండపాల వద్ద విధిగా ఆర్గనైజింగ్ కమిటీ వారి ప్రతినిధులు కాపలా ఉండాలని, రాత్రి సమయాలలో పందిళ్ళు/మండపాలలో విలువైన వస్తువులు ఉంచరాదన్నారు. వినాయక పందిళ్ళు గాని, విగ్రహం పెట్టే ప్రదేశం గాని రోడ్డుపైన ఉండరాదని,బ్యానర్లు/ప్లెక్సీలతో రోడ్డుపైన రాకపోకలకు అంతరాయం కలిగించరాదని, వినాయక చవితి ఉత్సవాల సమయంలో బాణసంచాలను ఉపయోగించరాదన్నారు. డీజే లకు  అనుమతి లేదన్నారు. వినాయక ఉత్సవ కమిటీ మెంబర్లు నిమజ్జనానికి ఉపయోగించే వాహనం యొక్క స్థితిని గమనించి మంచి కండిషన్లో ఉండే బండిని, లైసెన్స్ ఉన్న అనుభవం ఉన్న డ్రైవర్లను ఉపయోగించవలెనని తెలిపారు. పోలీస్ శాఖ నియమ నిబంధనలు మేరకు వినాయక చవితి పండుగ చేసుకోవాలని తెలిపారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: