Tuesday, 15 September 2026 02:49:13 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కొండకుమర్ల లో కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రతిపాదనలు వేగవంతం చేయాలి...

Date : 18 March 2023 11:18 PM Views : 515

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండల కేంద్రంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం లో మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు పర్వీన్ భాను అధ్యక్షతన నిర్వహించడం జరిగినది.ఈ సమావేశం నందు మండల జనాభా అవసరం మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అవసరం ఉండటం వలన కొండకుమర్ల గ్రామం నందు కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గతంలో ప్రతిపాదనలు పంపించడం జరిగినది. ఈ ప్రతిపాదనలు వేగవంతం చేయాలని తగిన చర్యలు తీసుకోవాలని ప్రస్తుత ఓడి చెరువు నందలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు పాత భవనమునకు బదులుగా కొత్త నిర్మాణమునకు రెండు కోట్ల విలువ ఆధారిత టెండర్లను పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దికుంట శ్రీధర్ రెడ్డిసహకారం తో వేగవంతం చేయాలని కోరడమైనది .అలాగే ఆసుపత్రికి వచ్చే రోగుల సౌకర్యార్థము పరిశుభ్రమైన నీరు నాణ్యమైన ప్రాథమిక సౌకర్యాలు కల్పించడానికి అయ్యే ఖర్చు సభ్యుల ద్వారా ఆమోదం తీసుకోవడం జరిగినది.మన మండలాధ్యక్షులు మాట్లాడుతూ ఆసుపత్రి ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మండలంలో విష జ్వరాలు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులైన మండల అభివృద్ధి అధికారి శ్రీ పోలప్ప ,ఓడి చెరువు సర్పంచ్ గోవింద్ కొండకుమర్ల సర్పంచ్ శ్రావణి , జిల్లా ప్రధాన కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్ ,వైద్యాధికారులు డాక్టర్ ఇనొద్దిన్ ,డాక్టర్ భాను ప్రకాష్, హెల్త్ సూపర్వైజర్ విజయ కుమారి, మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :