సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కేసు వివరణ: • తేదీ: 21.04.2025 • సమయం: మధ్యాహ్నం 1:50 గంటల సమయంలో • ఏఓ-1: సోమ సతీష్ కుమార్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, మణుగూరు పోలీస్ స్టేషన్ • ఏఓ-2: మిట్టపల్లి గోపీ, బిగ్ టీవీ రిపోర్టర్ అవినీతి ఘటన: • ఓ వ్యక్తి నుండి రూ. 4 లక్షల లంచం డిమాండ్ చేయడం జరిగింది. • అందులో రూ. 1 లక్ష తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. • గోపీ మధ్యవర్తిగా వ్యవహరించి, కేసులో బాధితుల పేర్లు చేర్చకుండా చూసే ప్రయత్నం చేశాడని తెలిపింది. కేసు వివరాలు: • కేసు నంబర్: 150/2025 • సెక్షన్లు: 318(4), 329(3) BNS & తెలంగాణ స్టేట్ గేమింగ్ (సవరణ) చట్టం సెక్షన్ 5 • ACB అధికారులు రసాయనిక పరీక్షలు చేసి అభియోగాలకి బలమైన ఆధారాలు సేకరించారు. తదుపరి చర్యలు: • ఇద్దరినీ అరెస్ట్ చేసి వారంగల్ ఎస్పీఈ & ఎసీబీ కోర్టులో హాజరుపరిచారు. సర్కార్ టీవీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి షేక్ ఆసిఫ్
-----------------------
Reporter