సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ గడ్డమీద ఎగరబోయేది బీసీ జెండా.. ఆర్ కృష్ణయ్య హుజూర్ నగర్లో దద్దరిల్లిన బీసీ మహా గర్జన... బీసీల ఐక్యతతో సింహం గుర్తు రఘున్న ఎమ్మెల్యేగా గెలిచేది ఎన్నాళ్ళు, ఎన్నేళ్లు దొరల పాలనలు మన బీసీల రాజ్యం మనకు వద్దా హుజూర్నగర్ పట్టణం ఎఐఎఫ్ బి పార్టీ సింహం గుర్తు ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లుట్ల రఘుకు రాష్ట్ర బీసీ సంఘాల మద్దతుతో నియోజకవర్గంలో భారీ రోడ్ షో మండవ శీను జాతీయ బీసీ సెక్రటరీ సభ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.. ఈ రోడ్ షోకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బీసీ సోదరులందరూ గుంపులు గుంపులుగా తండోపతండాలుగా తరలించారు. డోలు,డప్పు కళాకారుల నృత్యాలతో హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఎగరబోయేది సింహం గుర్తు ఎమ్మెల్యే బీసీ జెండా అని దద్దరిల్లినట్లు బీసీ నినాదలతో నియోజవర్గం మార్మోగి మోగిపోయింది. బీసీ సౌండ్ కు ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పట్టుకున్నట్లు అయింది. బీసీ కులస్తుల కాక అన్ని సామాజిక వర్గాల ప్రజలు, మహిళలు ఈ సభలో పాల్గొని పిల్లుట్ల రఘున్నకి మద్దతుని తెలిపినారు. నియోజకవర్గంలో కాంగ్రెస్, బిఆర్ యస్ పార్టీలు కాలం ముగిసినట్లేని ఈ సభతో అర్థం అయిపోయింది. సైదిరెడ్డి ఉత్తమ్ రెడ్డి పాలనలో విసిగిపోయామని ప్రజలు భారీ సంఖ్యలో సుమారు 30,000 హాజరైనారు. జాతీయ సమైక్య బిసి అధ్యక్షులు కృష్ణయ్యకు గజమాలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ నియోజవర్గంలో గత మూడు నాలుగు సంవత్సరాల కాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలతో అలుపెరుగని ప్రజాసేవే లక్ష్యంగా నిద్రాహారాలు మాని, ప్రజాసేవకే పాటుపడిన మన బీసీ బిడ్డ పిల్లుట్ల రఘు సింహం గుర్తుతో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడుఅతన్ని ఆదరించవలసిన బాధ్యత ప్రతి ఒక్క బీసీ పై ఉందని, మనలో ఐక్యత లేకనే ఇన్ని రోజులు వెనకబడిపోయినామని ఇకనైనా మన బతుకులు మార్చుకోవాలంటే మనలో ఒకడు అసెంబ్లీలో ఉండాలి. బీసీలు రాజకీయాలకు పనికిరారబీసీల్లో ఐక్యత లేదా బీసీల్లో విద్యావంతులు లేరాబీసీల్లో వ్యాపారస్తులు లేరాఎందుకు మరి మనకు వెనకబాటు తనం అని కృష్ణయ్య కార్నర్ మీటింగ్ లో ప్రశ్నించడం జరిగింది. రఘు అన్న సేవలకు అభిమానిగా మారి ఇండిపెండెంట్ అభ్యర్థి చీకురి లీలావతి మద్దతును తెలిపింది. తమ అభిమానులందరినీ సింహం గుర్తుపై ఓటేసి రఘున్న ఎమ్మెల్యే గెలుపునుకు సహకరించాలని ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపింది. ఈ రోడ్ షో కార్నర్ మీటింగ్లో పిల్లుట్ల రఘు మాట్లాడుతూ తల్లి 9నెలల తర్వాత బిడ్డకు జన్మనిస్తుందని, అదే 9 క్రమసంఖ్య సింహం గుర్తుతో రావడం ప్రజలకు బానిసపాలన నుండి పునర్జన్మ ఇవ్వడానికి అవకాశం వచ్చిందని అన్నారు నియోజవర్గంలో ఎన్నో సేవలతో ప్రజల ముందుకు వచ్చిన తనకు ప్రజలు ఎమ్మెల్యే గెలుపుతో ఆదరించాలని తనని ఆదరించకపోతే తన లాంటి నాయకుడు నియోజకవర్గానికి దొరకడని అధికారంలో లేకుండా నేను గొప్ప పనులు చేశానని, అధికారంలో ఉంటే మహా గొప్పగా చేస్తానని అన్నారు తాను స్థానికడుగా నిస్వార్థ సేవకుడిగా పని చేయడానికి వచ్చాను అని, ప్రజలు బాగోగులు చూసుకొని ప్రజల పక్షాన నిలబడడానికి వచ్చానని అన్నారు కొంతమంది కాంగ్రెస్ బిఆర్ యస్ పార్టీల నాయకులు తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అవి వాస్తవమైనవి కావు అని అన్నారు. తాను ఎప్పుడూ అమ్ముడుపోననిపైనుంచి దేవుడు కొంటానికి వచ్చిన తాను అమ్ముడుపోయే వ్యక్తి కాదని, ప్రజల సమస్యలు ఊరు సమస్యలు తీర్చడానికి వచ్చిన వ్యక్తినని అన్నారు. ఎన్నాళ్ళు ఈ బానిస పాలన అగ్రకుల వర్ణల వారికేనా పార్టీ టికెట్లు, మనలాంటి సామాన్యులకు లేవా పార్టీ టికెట్లు ఎందుకు ఇంత పక్షపాతం మన బతుకులు మార్చుకోవాలంటే కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలను బొందపెట్టి కొత్తదాన్ని కోరుకొని సింహం గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధిలో తీర్చిదిద్దామని అన్నారు. తను ఎమ్మెల్యేగా గెలిచాక ప్రతి ఒక్క ఊరు సమస్యను ప్రజల సమస్యలను తీరుస్తానని అన్నారుఇన్ని రోజులు అధికారం ఉన్నామని చెప్పుకునే నాయకులు కనీసం రోడ్ల వసతి తాగునీటి వసతి గాని కల్పించలేకపోయారని అన్నారు. ఇటువంటి దొంగ నాయకులును నమ్మవద్దని అవినీతి స్వార్ధపరులను నియోజవర్గం నుంచి పంపించివేసి ఎస్టీ బీసీ బీసీ ఓసి హిందూ ముస్లిం క్రిస్టియన్ మైనార్టీలలో కూడా మంచితనం ఉందని నిరూపించి సింహం గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారుకాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలకు దీటుగా మేనిఫెస్టో ఉంచానని ఎమ్మెల్యేగా గెలిచాక రెండు సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్క సమస్యను తీరుస్తానని అన్నారు. లేనియెడల రెండు సంవత్సరాల కాలంలో పదవి నుంచి వైదోలుగుతా అని అన్నారు. ప్రజలు కూడా ఆలోచించి మంచిచేసే వారి వైపే తమ అభిప్రాయం అని నిరూపించాలన్నారు మన ఓట్లతో గెలిచి నాయకులు పార్టీలు మారుతున్నారని ఇటువంటి దొంగ నాయకులు నమ్మవద్దు అని అన్నారు. పార్టీలో ఉన్న వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, పేదలను పట్టించుకోని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. మనం కాంగ్రెస్,బిఆర్ యస్ పార్టీల పాలనలో ఉన్నామా లేక ఉత్తమ్ కుమార్ రెడ్డి సైదిరెడ్డి భూకబ్జాల పాలనలో ఉన్నామా అని అన్నారు. ఏదేమైనా ప్రజలందరూ ఆలోచించి సింహం గుర్తుపై ఓటేసి తను ఎమ్మెల్యేగా గెలిపించాలని పిల్లుట్ల రఘు అన్నారుఈ విజయం బీసీల, అన్ని సామాజిక వర్గాల విజయంగా నియోజకవర్గంలో చరిత్ర సృష్టించాలని పిల్లుట్ల రఘు అన్నారు ఈ కార్నర్ మీటింగ్ సభలో రాష్ట్రస్థాయి బీసి సంఘాల నాయకులు మహిళ బీసీ నాయకులు, ప్రజలు రఘున్న అభిమానులు ఓజో ఫౌండేషన్ సభ్యులుయువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin