సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాదనగర్ పట్టణంలో ని బీజేపీ కార్యాలయంలో ప్రెస్ కి ముఖ్య అతిథిగా మంగళూరు ఎమ్మెల్యే వేద వ్యాస్ హాజరు అయినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన ప్రధాని నరేంద్రమోడీ గారు ప్రజల గురించి 803 యోజన పథకాలు తెచ్చారు అని, కారోన సమయంలో దేశ ప్రజలకు వాక్సిన్ ఇచ్చారాని మరియు కారోన సమయంలో ఉచితంగా రేషన్ బియ్యం ఇచ్చారని, తెలంగాణ రాష్టంలో నడుస్తుంది కుటుంబ పాలన, షాదనగర్ లో కూడా కుటుంబ పాలన నడుస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ లో కూడా కుటుంబ పాలన పాతుకుపోయింది అని పేర్కొన్నారు, ఒక్క భారతీయ జనతా పార్టీలో మాత్రమే సామాన్య కార్యకర్త నుండి ప్రధాన మంత్రి స్ధాయి వరకు అవ్వగలరు అని చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తే రియల్ ఎస్టేట్ కుంటుపడుతడి అని అలాగే రైతులు బాగుపడతారు అని అందుకే పెండింగ్ లో పెట్టారని, కావున బీజేపీ పార్టీ అధికారంలోకి రాగానే మొట్ట మొదట పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తాం అని పేర్కొన్నారు. మండలానికి ఒక గవర్నమెంట్ కాలేజ్ ఇస్తాం అని చెప్పి విద్యార్థులను మోసాగించారు. షాదనగర్ పట్టణంలో సరైన మురుగు నీరు వ్యవస్థ కూడా లేకపోవడం అధికార పార్టీకి షాదనగర్ పట్టణం మీద చిత్తశుద్ధి ఏంటో వ్యక్తం అవుతుంది. బిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజలు విసుగు పోయారని రాబోయే ఎన్నికల్లో వచ్చేది బీజేపీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేపల్లి అశోక్ గౌడ్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ కమ్మరి భూపాల్ చారి, జిల్లా అధికార ప్రతినిధి కక్కునూరి వెంకటేష్ గుప్తా, అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ టంగుటూరి విజయ్ కుమార్ పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, చిట్టెం లక్మ్బకాంత్ రెడ్డి, కందురీ మనోహర్ రెడ్డి, మలచల్ మురళి, మండలాల అధ్యక్షులు మఠం రుషుకేశ్, దొడల వెంకటేష్ యాదవ్, పసుల నర్సింలు యాదవ్, కోమరబండ శ్రీశైలం, కూర్మయ్య, సుధాకరప్ప, విస్తారక్ సాయిబాబా గౌడ్, ఆకుల ప్రదీప్, భాస్కర్ చారి, నరేందర్ రెడ్డి, మాణిక్యం, కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin