సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల బంద్ విజయవంతం... విద్యార్థుల ప్రాణాలు పోతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులు పట్టించుకోవడంలేదని వేములపల్లి మాజీ వైస్ ఎంపీపీ గోవర్ధన ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్ర సైదా నాయక్ అన్నారు.శనివారం రాష్ర్ట వ్యాప్త ప్రభుత్వ పాఠశాల బంద్ లో భాగంగా మిర్యాలగూడ పట్టణ కేంద్రంలోని పాఠశాలలు బంద్ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గత నెల రోజుల నుండి ఫుడ్ ఫాయిజన్ తో విద్యార్థుల ప్రాణాలు పోతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతుందన్నారు.విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకుండా దొడ్డు బియ్యంతో నాసిరకమైన కూరగాయలతో భోజనం పెడుతున్నారన్నారు.గురుకుల, సంక్షేమ హాస్టల్లు, జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత లేని కారణంగా రాష్ట్ర వ్యాపితంగా విద్యార్థులు ఫుడ్ ఫయిజాన్ తో అస్వస్థకు గురవుతున్నారు.వరుస ఘటనలపై ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి అలాగే ఫుడ్ ఫాయిజన్ తో మృతి చెందిన విద్యార్థుల మృతి కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు తక్షణమే ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల మధ్యాహ్న భోజనం మెనూ పెంచాలని.ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ప్రభుత్వ పాఠశాలల బంద్ విజయవంతం.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ అధ్యక్షుడు జగన్ ఎస్ఎఫ్ఐ టౌన్ కార్యదర్శి న్యూమన్ ఎస్ఎఫ్ఐ నాయకులు అనిల్ అఖిల్ బన్నీ బిస్మిల్లా సూర్య సైదులు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin