సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం లో కొండకుమర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న వందమంది పదవ తరగతి విద్యార్థులందరికీ మాదిరి ప్రశ్న పత్రాల పుస్తకాలను సేగు సింధుజ , సాగర్ దంపతుల కుమారుడు మనవిత్ పుట్టినరోజు సందర్భంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర్ అధ్యక్షత వహించారు. రోటరీ క్లబ్ ఆఫ్ కదిరి ప్రెసిడెంట్ రంజిత్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ UTF ప్రశ్న పత్ర పుస్తకాలను ఉపయోగించుకొని ఉపాధ్యాయుల సూచన మేరకు చదివి రాబోయే పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించి పాఠశాలకు, గ్రామానికి పేరు తేవాలని కోరారు. పదవ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆర్థిక సహాయ సహకారాలు అందజేస్తామని మరియు సన్మానం చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు తాహిర్ వలి, నేతి అభినయ్, ఉపాధ్యాయులు ఖాదర్బాషా, రామాంజనేయులు, యశోదలు పాల్గొన్నారు....
-----------------------
Admin