సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : మణుగూరు-పురపాలక కార్యాలయం"లో అట్టహాసంగా మహిళాదినోత్సవ వేడుకలు.. మహిళా అధ్యక్షురాలు కూరపాటి సౌజన్య గారి నేతృత్వంలో... "విజయ్ గాంధీ" చేయూతగా మహిళలకు చీరలు-మిఠాయిలు పంపిణీ...!! వేడుకల్లో పాల్గొన్న నియోజకవర్గ-మండల స్థాయి కాంగ్రెస్ నాయకులు...!! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పురపాలక కార్యాలయం లో స్వచ్ఛతా-పరిశుభ్రతకే కొలమాణంగా నిత్యం ఈ సమాజాంలోని పారిశుద్ధ్యానికి ప్రాణంపోసే పంచాయతీ మున్సిపాలిటీకి చెందిన మహిళా కార్మికులను...నేడు మహిళాదినోత్సవం సందర్భంగా సగౌరవంతో చిరుసన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వారుచేస్తున్న సేవలను-సమాజ బాధ్యతను గుర్తుచేసుకుంటూ సహృదయంతో వారిని అభినందిస్తూ... వారి అమూల్యమైన సమాజసేవలను స్మరించుకోవడం హర్షించదగ్గవిషయమని ఈ సందర్భంగా పలువురు శ్రేణులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల కాంగ్రెస్ అధ్యక్షులు పిరినాకి నవీన్, నియోజకవర్గ కోఆర్డినేటర్ కాటిబోయిన నాగేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ బీరం సుధాకర్ రెడ్డి, బీసీ సంఘం నాయకులు పెనుగొండ సాంబశివరావు, కొత్తపల్లి సత్యనారాయణ, మణుగూరు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జానపాటివేణు, జిల్లా నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు భోగినేని వరలక్ష్మి, మండల అధ్యక్షురాలు సౌజన్య, చందా వెంకటరత్నం, పార్టీ సోషల్ మీడియా సభ్యులు మొహమ్మద్ షకీల్, యువజన కాంగ్రెస్ శ్రేణులు వర్సా ప్రకాష్-బొర్రా సత్తి-షకీల్-కుంజా ప్రవీణ్-స్థానిక సిబ్బంది-మహిళలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin