Sunday, 13 September 2026 11:57:22 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

*ప్రజలకు బిగ్‌ అలర్ట్.. రేపు దేశ వ్యాప్తంగా మెడికల్ షాప్‌లు బంద్.. ఎందుకంటే?*

Date : 19 May 2026 07:26 PM Views : 742

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు తెలంగాణ ఛాంబర్‌ ఆఫ్‌ కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ కీలక సూచనలు చేసింది. డిజిటల్ ఈ-ఫార్మసీల అనియంత్రిత వృద్ధికి, కార్పొరేట్ సంస్థల దోపిడీ ధరల విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఫార్మా వ్యాపారులు నిరసన జ్వాలలు రగిల్చారు. ఈ మేరకు మే 20వ తేదీన అంటే బుధవారం హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో మెడికల్‌ షాప్‌లు క్లోజ్ చేయాలని నిర్ణయించారు. అఖిల భారత కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా… తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ , హైదరాబాద్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ ఒక్కరోజు సమ్మెకు దిగనున్నారు.భారీ నిధులతో మార్కెట్లోకి వస్తున్న కార్పొరేట్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల దూకుడు విస్తరణ వల్ల జంట నగరాల్లోని స్థానిక ఫార్మసీలు పూర్తిగా దెబ్బతింటున్నాయని HCDA అధ్యక్షుడు ఎ. శ్రీధర్ గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ… ఇది మా మనుగడ కోసం సాగిస్తున్న యుద్ధం. పెద్ద కార్పొరేట్ సంస్థలు ఇస్తున్న అడ్డగోలు డిస్కౌంట్ల వల్ల, ముఖ్యంగా సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో తరతరాలుగా ప్రజలకు సేవలందిస్తున్న చిన్న మెడికల్ షాపులు మూతపడే పరిస్థితి వచ్చింది అన్నారు.కరోనా మహమ్మారి సమయంలో ఆన్‌లైన్ డ్రగ్ రిటైల్ నిబంధనలను సడలిస్తూ తెచ్చిన తాత్కాలిక అత్యవసర నోటిఫికేషన్‌లను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ వ్యాపారులందరికీ సమాన అవకాశాలు కల్పించేలా కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని కోరారు. అయితే, ఈ సమ్మె వల్ల తెలుగు రాష్ట్రాల్లోని రోగులకు, సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రతినిధులు స్పష్టం చేశారు.

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: