Wednesday, 29 July 2026 05:29:14 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కంటి వెలుగు ప్రోగ్రాం సమీక్షా సమావేశం... ముఖ్య అతిథిగా డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ ఎస్ జయలక్ష్మి

Date : 27 May 2023 12:40 AM Views : 491

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ డివిజన్లోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులకు, సూపర్వైజర్లకు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు, తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం జనవరి నెలలో 19వ తారీఖు రోజున మొదలై, ఇప్పటికీ నిరంతరంగా పరీక్షలు నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం గురించీ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ఎస్ జయలక్ష్మి సమీక్షా సమావేశం నిర్వహించారు. జయలక్ష్మి మాట్లాడుతూ... షాద్ నగర్ డివిజన్ పరిధిలో 18 సంవత్సరములు నిండిన వారు 1,24 051 మందికి పరీక్షలు చేయవలసి ఉండగా, ఈరోజు వరకు డివిజన్లోని 6 మండలాలలో 10 కంటి వెలుగు టీమ్ లు పనిచేస్తూ 1,14,178 మందికి కంటి పరీక్షలు నిర్వహించారని తెలియజేశారు. ఇందులో అందరికీ కంటి పరీక్షలు నిర్వహించి, వీరిలో దగ్గర చూపు మందగించిన 13,636 మందికి వెంటనే కంటి అద్దాలు (రీడింగ్ గ్లాసెస్) అందజేశారు. కంటి పరీక్షలు నిర్వహించిన వారిలో దగ్గర చూపు, దూరపు చూపు మందగించిన 6336 మందికి ప్రిన్సుప్షన్ గ్లాసెస్ కోసము ఆడరు ఇవ్వడము జరిగిందని డాక్టర్ జయలక్ష్మి తెలియజేశారు. పరీక్షలు నిర్వహించిన వారిలో 14,294 మందికి కాంట్రాక్టు ప్రాబ్లమ్ ఉంది అని గుర్తించి, సరోజినీ దేవి ఆసుపత్రికి రిఫరల్ చేశారని చెప్పారు. ఇప్పటి వరకు షాద్ నగర్ డివిజన్లో 10 కంటి వెలుగు టీములు పనిచేస్తూ విజయవంతంగా కంటి వెలుగు ప్రోగ్రామును నిర్వహిస్తూ ఇప్పటివరకు 92 శాతం కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. వచ్చే నెల జూన్ చివరి వారం నాటికి పూర్తిగా అర్హులైన వారి అందరికీ కంటి పరీక్షలు నిర్వహించి 100% సాధిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటెడ్ జె శ్రీనివాసులు, డివిజన్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులు, హెల్త్ సూపర్వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :