సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సత్తుపల్లి మండలంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు హనుమాన్ యూత్ వారి అధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు... సత్తుపల్లి పట్టణం హనుమాన్ నగర్ లో హనుమాన్ యూత్ వారి అధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు గత పది రోజులుగా అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ రోజు ఆకరి రోజు కావటంతో హనుమాన్ యూత్ మహిళ మూర్తులు దాదాపుగా 200 బతుకమ్మలతో సంబరాలు ఆకాశాన్ని అంటాయి. ఈ కార్యక్రమంలో యువతే కాకుండా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఆట పాటలతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ యూత్ ప్రెసిడెంట్ కొన శ్రీనివాసరావు మరియు కమిటీ సభ్యులు అందరూ పాల్గొన్నారు.
-----------------------
Admin