Sunday, 07 June 2026 10:16:21 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

మంత్రి పువ్వాడ చేతుల మీదుగా చెక్కు అందజేత...

Date : 20 December 2022 12:11 AM Views : 1120

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : రెక్కాడితే కానీ డొక్కాడదు ఆ కుటుంబం పరిస్థితి.. అమ్మాయిలు పుట్టారని తండ్రి వారిని చిన్న తనంలోనే వదిలేయడంతో తల్లి కష్టాలను భరిస్తూ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుని చదివించింది. పేదరికంతో కొట్టుమిట్టాడుతూ తమ పిల్లలు ఉన్నత చదువులు చదవాలని తపించింది. చదివే లక్ష్యంగా ఎంచుకుని ప్రస్తుత పరిస్థితితులలోని పోటీ ప్రపంచంలో నెగ్గి MBBS ఎంట్రన్స్ (Neet) లో సీట్ సాధించి శభాష్ అనిపించుకుంది. ఖమ్మం నగరం గోపాలపురానికి చెందిన విద్యార్థిని సూరారపు పూజిత సీట్ సాధించినప్పటికీ దాతల కోసం చూస్తున్న తరుణంలో తన ప్రతిభను, వారి పేదరికాన్ని గుర్తించి శ్రీ విద్యానికేతన్ స్కూల్ డైరెక్టర్ గొల్లపూడి రాంప్రసాద్ గుర్తించారు. విద్యార్థినికి అవసరం అయ్యే మొదటి సంవత్సర చదువు ఖర్చుల కోసం అవసరమైన రూ.1.20 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని సోమవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదుగా అందించారు. చదువులో వెనుకడుగు వేయకుండా ఎంబిబిఎస్ పూర్తి చేసుకుని ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలని సూచించారు. అతి పేదరికంలో పుట్టి ఆర్థిక స్థితిగతులలో వెనుకబడి ఉన్నా తల్లిదండ్రుల కన్నీటి కష్టాలను దిగమింగుకొని MBBS సీటు సాధించడం గర్వకారణమని మంత్రి పువ్వాడ కొనియాడారు. మొత్తం 5సంవత్సరాలు విద్య పూర్తి అయ్యేందుకు అయ్యే ఖర్చులు ఎర్పటు చేస్తామని భరోసా కల్పించారు. వైద్యురాలు అయి తల్లి కల ను నెరవేర్చి ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. విద్యార్థినికి సహాయం చేసేందుకు ముందుకొచ్చిన గొల్లపూడి రాంప్రసాద్ ను మంత్రి పువ్వాడ అభినందించారు. కార్యక్రమంలో గొల్లపూడి సతీష్, నాగభూషణం, మోహన్, నర్సింహ, అశోక్, రవి, గోపి, అలీ సాహెబ్, వెంకన్న, శివరామకృష్ణ, శ్రీను తదితరులు ఉన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :