సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పిట్టల మల్లయ్య ముదిరాజ్ అనారోగ్యంతో మరణించగా బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు, నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ మరియు తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ మల్లయ్య పార్ధివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు, నల్లబెల్లి పట్టణ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పాండవుల రాంబాబు ముదిరాజ్, మాజీ యంపిటిసి జన్ను జయరావ్, బీసీ సంక్షేమ సంఘం మండల నాయకులు నాగెల్లి శ్రీనివాస్, డ్యాగల రామ్ చరణ్ సాయి, పాండవుల సుభాష్, పాండవుల వెంకటేశ్వర్లు, గొర్రె ప్రభాకర్, ముత్యాల కమల్, పిట్టల రమేష్, హరీష్, యశ్వంత్ లు పూలు వేసి నివాళులు అర్పించారు.
-----------------------
Reporter