Thursday, 30 July 2026 04:53:01 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వీర్లపల్లి శంకర్ ను గెలిపించాలని రాహుల్ గాంధీ విన్నపం...

Date : 02 November 2023 11:28 AM Views : 288

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక నియంతల పాలన కొనసాగిస్తున్నారని దేశంలో ఏ ప్రాజెక్టులో జరగని అవినీతి కేవలం కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిందని కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. బుధవారం ఈమెరకు షాద్ నగర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాహుల్ గాంధీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి రాగానే కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన దోపిడీ సొమ్ము ప్రజలకిస్తామన్నారు. కంప్యూటరైజేషన్‌ పేరుతో ధరణిలో భారీగా దోపిడీ జరిగిందని రాహుల్‌ గాంధీ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా దోపిడీ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన కాళేశ్వరం ఏటీఎం అని ఓ పోస్టర్ చూపించారు.ఈ శతాబ్దంలో ఇదే అతిపెద్ద స్కాం అని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో దాదాపు రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణలోని మహిళలకు నెలకు రూ.2500 జమ చేస్తామన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రూ. 500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. ప్రతి మహిళకు నెలకు రూ. 2500తో పాటు 500కే సిలిండర్ వస్తుందన్నారు.కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే మహిళలకు బస్సుల్లో ప్రయాణం ఉచితమని రాహుల్ గాంధీ మరోసారి పునరుద్ఘాటించారు. ఎక్కడికైనా వెళ్లేందుకు బస్సు చార్జీలకే రూ. 1000-1500 ఖర్చు అవుతుందని ఆ ఖర్చుల బాధలను తగ్గించేందుకు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ తనపై 24 కేసులు పెట్టాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. వాళ్లు దేశాన్ని విభజించాలని చూస్తే.. నేను మాత్రం దేశాన్ని కలిపి ఉంచాలని చూస్తానని ప్రకటించారు. ధరణితో 25 లక్షల మంది రైతుల భూములను దోచుకున్నారని ఆయన ఆరోపించారు. సర్కార్ నాకు ఇచ్చిన ఇళ్లును కూడా నరేంద్ర మోదీ లాక్కున్నారని ఆయన అన్నారు. భారతదేశంలో కులగణన జరగాల్సిందేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఓబీసీలకు అధికారాన్ని ఇవ్వడానికి బీజేపీ, బీఆర్ఎస్ లు నిరాకరిస్తున్నాయని.. అందుకే బీసీ కులగణనకు ఆ పార్టీలు ఒప్పుకోవడం లేదని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే కులగణన చేపడతామని ప్రకటించారు. అదేవిధంగా కేంద్రంలో అధికారం చేపట్టగానే హిందూస్థాన్ అంతా కుగణన చేస్తామని రాహుల్ గాంధీ వెల్లడించారు. వీర్లపల్లి శంకర్ ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిపించాలని రాహుల్ గాంధీ కోరారు. దేశంలో బిజెపి విద్వేషం రెచ్చగొడుతుండగా తాను మాత్రం ప్రేమను పంచుతున్నానని పదేపదే చెప్పారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బట్టి విక్రమార్క, వంశీచంద్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి, షాద్ నగర్ కాన్స్టెన్సీ ఎమ్మెల్యే అభ్యర్థి వీర్లపల్లి శంకర్, మాజీ జెడ్పీటీసీ శ్యాంసుందర్ రెడ్డి, జెడ్పీటీసీ తాండ్ర విశాల, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :