సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పిడిఎస్ యూ 50 వసంతాల సందర్భంగా సూర్యాపేట పి.డి.ఎస్.యూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 60 ఫీట్ రోడ్డు నుండి కొత్త బస్ స్టాప్,శంకర్ విలాస్ సెంటర్ గాంధీ పార్కు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పి. డి. ఎస్. యు జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహద్రి అధ్యక్షతన అర్ధ శతాబ్దోత్సవ సభ గాంధీ పార్కు లో నిర్వహించారు. ఈ సభకు సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్, పి డి. ఎస్ యు మాజీ జిల్లా కార్యదర్శి గంట నాగయ్య, పి డి. ఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలేబోయిన కిరణ్, జిల్లా కార్యదర్శి ఎం. చందర్ రావులు పాల్గొని మాట్లాడుతూ 1974లో చారిత్రాత్మక అవసరంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆవిర్భవించింది అన్నారు. కమ్యూనిస్టులు ఆంధ్ర జన సంఘం లేకపోతే ఆంధ్ర మహాసభ లేదన్నారు వారి ఉద్యమాల్ని పల్లెటూర్లలో ప్రజలను చైతన్య పరిచయాన్ని చెప్పారు. పిడిఎస్యులో ఉస్మానియా యూనివర్సిటీలో ఫిజిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించి విద్యార్థి విప్లవాలకు అరుణ తారగా నిలిచిన కామ్రేడ్ జార్జి రెడ్డి ఆశయాలను సాధించాలన్నారు. విద్యార్థి అంటే కేవలం విద్యార్థి కాదని సమాజం మొత్తం విద్యార్థితో ముడిపడి ఉంటుందన్నారు శ్రీ శ్రీ, చరబండ రాజు విప్లవ గేయాలను స్మరించారు. నూతన మానవ పరిణామ క్రమం జరగాలంటే కాగే నెత్తుటితోనే సాధ్యమవుతుందన్నారు. నల్లగొండ జిల్లా ప్రగతిశీల ప్రజాస్వామ్య భావజాలానికి పురుడు పోసిందన్నారు. తెలంగాణ సాయుధ గెరిల్లా రైతాంగ పోరాట స్పూర్తితో, నక్సల్స్బరి, శ్రీకాకుళం, గోదావరిలోయ ప్రతిఘటన పోరాటాల ప్రేరణతో 1972 లో ఉస్మానియా యూనివర్సిటీ లో విప్లవ విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి నేతృత్వంలో పిడిఎస్ పురుడుపోసుకొని 74లో జె.సి.ఎస్ ప్రసాద్ నాయకత్వం లో పిడిఎస్ యూ గా ఆర్భవించి నేటికి 50 వసంతాలు పూర్తి చేసుంటున్న పిడిఎస్ యూ ఆవిర్భవించిన నాటి నుండి నేటి వరకు విద్యార్థి సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్వహించిందని అన్నారు. సామ్రాజ్యవాద, బడా పెట్టుబడిదారీ, అగ్రకుల బ్రాహ్మణ సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడిందని అన్నారు. అర్థవలస, అర్ధ భూస్వామ్య వ్యవస్థ స్థానంలో నూతన ప్రజాస్వామిక విప్లవ వ్యవస్థ నిర్మాణం కోసం బలమైన విప్లవ విద్యార్థి ఉద్యమాలను నడిపిందని అన్నారు. శాస్ర్తియ విద్య సాధనే లక్ష్యం గా విద్యార్థులను కూడా గట్టిందని అన్నారు. దోపిడీ, పీడన అసమానతలు,కులం,మతం లేని సమాజంకై ఉద్యమించినదని అన్నారు. అభివృద్ధి ముసుగులో దోపిడీ పాలకవర్గాలు సాగించిన విధ్వంసకర విధానాలను పిడిఎస్ యూ ఎడగట్టిందని ఈ క్రమంలోనే అనేక మంది జార్జిరెడ్డి, జే.సీ.ఎస్ ప్రసాద్, శ్రీపాద శ్రీహరి, రంగవల్లి,మారోజు వీరన్న, చేరాలు,వరహాలు, కోలా శంకర్ లాంటి ఎందరో మెరికల్లాంటి విద్యార్థి యువ రత్నాలను కోల్పోయిందని అన్నారు. ఎన్ని నిర్బందాలు, దాడులు ,రాజ్యహింస పెరిగినప్పటికి అడుగడుగునా రక్త మడుగు, పిడిఎస్ యూ ముందడుగు అనే నినాదాలతో మరింత ఉద్యమాన్ని పడునెక్కించారని అన్నారు. దేశంలో కుల,మత అంతరాలు పోవాలని, దోపిడిలేని సమాజం రావాలని పిడిఎస్ యూ పోరాడుతున్నదని అందులో భాగంగానే పిడిఎస్ యూ సంస్థ కు 50 ఏండ్లు నిండాయని అందులో భాగంగానే అర్ధ శతాబ్ది ఉత్సావాలను సెప్టెంబర్ 15 నుండి 24 వరకు పిడిఎస్ యూ పిలుపునిచ్చిందని అందులో భాగంగా అక్టోబర్ , అక్టోబర్ 24న ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో పెద్దఎత్తున సభలు జరుగుతాయని ఈసభలకు పిడిఎస్ యూ పూర్వ మరియు ప్రస్తుత విద్యార్థులు, సానుభూతి పరులు, విద్యాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈ సభలో మాజీ పి.డి.ఎస్.యూ నాయకులు బొడ్డు శంకర్, మాజీ జిల్లా కార్యదర్శి కునుకుంట్ల సైదులు, వెంకట్ యాదవ్,గుండు వెంకన్న, అరుణోదయ జిల్లా కార్యదర్శి ఉదయగిరి, డివిజన్ అధ్యక్షులు తడకమళ్ల నాగమల్లు, గండు నగేష్, సామా నర్సిరెడ్డి,బొల్లె వెంకన్న, పి. డి. ఎస్. యు డివిజన్ కార్యదర్శి పిడమర్తి భరత్, మాజీ పిడి ఎస్ యూ నాయకులు బండి రవి, దుదిపాల ప్రవీణ్, దేసోజు మధు, వీరబోయిన లింగయ్య, మందడి శ్రీధర్, కేశబోయిన వంశీ, వేణు, రాఖీ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin