సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాలు సందర్భంగా తెదేపా రాష్టకార్యనిర్వహక కార్యదర్శి శ్రీమతి సవితమ్మ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ . శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ పట్టణంలోని సవితమ్మ కార్యాలయంలో తెదేపా రాష్టకార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు యుగ పురుషుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు సందర్భంగా సత్యసాయి జిల్లా పెనుకొండ మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల నందు ఈ నెల 18 వ తేదీ నుండి పెనుకొండ నియోజకవర్గం లో ఉన్న ఐదు మండలాలు లో ఉన్న క్రీడాకారులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించబడును కావున నియోజకవర్గం లో ఉన్న క్రీడాకారులందరూ పేర్లు నమోదు చేసుకోవాలని తెలియజేస్తున్నాము. అదేవిధంగా గెలుపొందిన మ్యాచ్ కు మొదటి బహుమతి గా 50,116 రెండవ బహుమతి 30,116 గా రూపాయలు అందచేయబడును.అనంతరం క్రికెట్ టోర్నమెంట్ సంబంధించిన కరపత్రాలు విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వ కార్యదర్శి సవితమ్మ సీనియర్ టిడిపి నాయకులు మాధవ నాయుడు అడదాకులపల్లి మాజీ సర్పంచ్ ప్రసాద్, త్రివేంద్ర నాయుడు,బాబుల్ రెడ్డి, చిన్న పోతున్న మావుటూరు గోపాల్, బుసప్ప వీర చిన్న ,మణికంఠ దాదు సానిపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు వెంకటేష్ బూచేర్ల నారాయణ, మరియు ఇతర నాయకులు.....
-----------------------
Admin