Wednesday, 29 July 2026 08:18:03 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పనిని బట్టి వేతనం తీసుకోవాల్సి వస్తే, ముఖ్యమంత్రి, మంత్రులు,MLA ల కంటే ఆశా వర్కర్లు కే ఎక్కువ జీతం ఇవ్వాలి...

Date : 24 August 2023 02:31 AM Views : 403

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ఆశా వర్కర్లు చేసే పని ప్రభుత్వం లో ఉన్న అమాత్యులు ఎవరైనా ఒక్కరోజైనా చేయగలరా మంత్రి వర్గానికి CITU ఎ.జె.రమేష్ సూటి ప్రశ్న రాష్ట్రం లో కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో పని చేసిన ఆశా వర్కర్లు పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష ప్రదర్శిస్తూ,పనిని బట్టి పారితోషకం ఇస్తున్నారని,అట్లా పనిని బట్టి వేతనం తీసుకోవాల్సి వస్తే మంత్రి వర్గం లో ఉన్న వారందరి కంటే ఎక్కువ వేతనాలు ఆశా వర్కర్లు కి ఇవ్వాలని CITU జిల్లా కార్యదర్శి ఎ.జె.రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణా ఆశా వర్కర్లు యూనియన్,CITU రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నవభారత్ నుండి కలక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శన అనంతరం ఆశా వర్కర్లు యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి అధ్యక్షతన జరిగిన సభలో ఎ.జె.రమేష్ మాట్లాడుతూ ఉదయాన్నే 7 గంటల మొదలు రాత్రి 7 గంటల వరకు గ్రామాల్లో, PHC లలో ప్రజల ఆరోగ్యాలతో పట్ల అత్యంత బాధ్యత గా ఆశా వర్కర్లు పని చేస్తున్నారని అన్నారు. తీవ్రమైన పని భారం ఉన్నప్పటికీ ప్రభుత్వం పని భారాన్ని తగ్గించడం కానీ,ఆంధ్ర ప్రదేశ్ లో మాదిరిగా ఆశా వర్కర్లు కి ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించడం కానీ చేయడం లేదన్నారు.పనిని బట్టి పారితోషకం విధానం స్థానం లో నెలకు 18 వేల రూపాయలు ఫిక్స్ డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ధనిక రాష్ట్రం అని చెప్పుకునే BRS పాలకులకు క్షేత్ర స్థాయిలో కష్టపడి పని చేసే ఆశాలకు వేతనాలను నిర్ణయించడం లో ఎందుకు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని ప్రశ్నించారు.ప్రభుత్వం లో ఉన్న ఏ ఒక్క మంత్రైనా ఒక్క రోజు ఆశా వర్కర్లు చేసే పని చేయగలరా ఆని సవాల్ విసిరారు.తెలంగాణా రాష్ట్రం వచ్చిన దగ్గర నుండి ప్రభుత్వాన్ని ఫిక్స్ డ్ వేతనాన్ని డిమాండ్ చేసినప్పటికీ హామీలు మాత్రమే వస్తున్నాయని ఎద్దేవా చేసారు.ఈ పథకాన్ని మొత్తంగా రద్దు చేసి ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి కూడా కేంద్రం BJP వెనకాడటం లేదని అన్నారు.ఆశా డే రోజున మహిళలుగా ఉన్న ఆశా వర్కర్లు కి టాయిలెట్స్ సౌకర్యం,డ్రస్ మార్చుకునే సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.రెండవ ANM ట్రైనింగ్ తీసుకున్న ఆశా వర్కర్లు ని ANM లుగా రిక్రూట్మెంట్ లో తగిన వేయితేజ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ జిలకర పద్మ మాట్లాడుతూ పారితోషకం లేని అదనపు పనులు ఆశా వర్కర్లు తో చేయించవద్దని,లెప్రసి సర్వేలో వస్తున్న ఇబ్బందులను పరిష్కరించడానికి ఒక వాలంటీర్ నియర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.2021 జూలై నుండి డిసెంబర్ వరకు ఆరు నెలల PRC ఏరియర్స్ ని వెంటనే చెల్లించాలని కేంద్రం చెల్లించిన కరోనా రిస్క్ అలవెన్స్ నెలకు వెయ్యి చొప్పున పదహారు నెలల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.ప్రమాద భీమ,PF,ESI సౌకర్యం అమలు చేయాలని,రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10 లక్షలు ఇవ్వాలని లేని యెడల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని పద్మ హెచ్చరించారు. ధర్నా వద్దకు వచ్చిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శిరీష కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.అందుకు స్పందించిన శిరీష మాట్లాడుతూ జిల్లా పరిధిలో ఉన్న ఆశా డే రోజు టాయిలెట్స్,డ్రస్ చేజ్ కోసం ప్రత్యేక రూం సౌకర్యం ఏర్పాటు చేస్తామని,సబ్ సెంటర్లలో సిబ్బంది పని ఒత్తిడివల్ల చేస్తామని హామీ ఇచ్చారు.ఫిక్స్ డ్ వేతనం,ప్రమాద భీమా తదితర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతానని హామీ ఇచ్చారు. ప్రదర్శన,ధర్నా కార్యక్రమానికి CITU జిల్లా ఉపాధ్యక్షులు దొడ్డ రవి కుమార్,సహాయ కార్యదర్శులు డి.వీరన్న,కె.సత్య,ఆశా వర్కర్లు యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు విజయ,రమణ, సునీత,హైన,మాధవి,జయమ్మ,కిరణ్ కుమారి, నాగమణి,సుగుణ,భారతి,చంద్రకళ,రుక్మిణీ తదితరులు నాయకత్వం వహించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :