Thursday, 30 July 2026 04:24:27 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఘనంగా కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం 13 వ వర్ధంతి...

Date : 27 March 2024 07:09 AM Views : 296

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తిరుమలగిరి చౌరస్తాలో సిపిఐ ఆధ్వర్యంలో కామ్రేడ్ బొమ్మ గాని ధర్మభిక్షం 13వ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా కార్యవర్గ సభ్యులు యాదగిరి మాట్లాడారు. ప్రముఖ స్వాతంత్ర సమయోధుడు,తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధుడు, కల్లుగీత పరివారం జాతీయ అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రజా నాయకుడిగా కామ్రేడ్ బొమ్మగాని ధర్మ బిక్షం ప్రజలలో స్థిర స్థానం సంపాదించారని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో దున్నేవానికి భూమి గీసే వాడికే చెట్టు కావాలని నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా దొరలకు భూస్వాములకు జాగిర్దారులకు దేశ్ పాండేలకు వ్యతిరేకంగా పేద ప్రజల కోసం వారి హక్కుల కోసం పోరాడిన మహానీయుడు అని కొనియాడారు. నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాడి 10 లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచిపెట్టి 3000 గ్రామాల్లో ప్రజారాజ్యాన్ని ఏర్పాటు చేయటంలో కామ్రేడ్ ధర్మ బిక్షం పాత్ర ఎనలేనిదని ఆయన అన్నారు. గీత కార్మికులకు చెట్టు పన్ను రద్దు ప్రమాదవశాత్తు చెట్టు మీద నుండి పడితే వారికి నష్టపరిహారం, కల్లు ను శీతల పానీయo గా గుర్తించాలని , వారికి ఇన్సూరెన్స్ కోసం, హక్కుల కోసం పోరాడిన గొప్ప యోధుడని అన్నారు . భిక్షాటన చేసి హాస్టల్స్, స్కూల్ పెట్టి చదివించిన గొప్ప విద్యా దానం చేసిన నాయకుడు.చాలామంది పేదవాల కు ఉచితంగా చదువు చెప్పి వారిని వివిధ ఉద్యోగాలలో పెద్ద స్థాయిలో నిలిపిన గొప్ప చరిత్ర గల వ్యక్తి. అంతటి చరిత్ర గల వ్యక్తి మూడుసార్లు,ఎంపీగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రజల్లో గెలిచి చట్టసభల్లో ప్రజా హక్కుల కోసం పోరాడి వారి సమస్యలను సాధించిన గొప్ప మహనీయుడు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి తిపిరాల శ్రీకాంత్ , సామాజిక తెలంగాణ అధ్యక్షుడు కొత్తగట్టు మల్లయ్య, బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యాక్షుడు ప్రభు , ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు ఫయాజ్,జంబు రాష్ట్ర నాయకులు పత్తేపురం యాదగిరి, రామ్ గౌడ్ , సిపిఐ నాయకులు కనుక అశోక్ , ముత్యాల యాకస్వామి , బోండ్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: