సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ప్రముఖ వ్యాపారవేత్త సుధాకర్ పివిసి పైపుల అధినేత సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్మన్ స్వర్గీయ మీలా సత్యనారాయణ 93వ జయంతి వేడుకలను సూర్యాపేట జర్నలిస్టులు జరుపుకున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో యూనియన్లకు అసోసియేషన్లకు అతీతంగా జర్నలిస్టులు పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు.ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు డాక్టర్ బంటు కృష్ణ పాల్వాయి జానయ్య కందుకూరి యాదగిరి మడూరి బ్రహ్మచారి బచ్చు పురుషోత్తం పెనుగొండ మల్లికార్జున్ లు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా సూర్యపేట మండలం సోలిపేట గ్రామంలో జన్మించి,వ్యాపార రీత్యా సూర్యాపేట పట్టణంలో స్థిరపడి సుధాకర్ పివిసి పైపుల వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగి సూర్యాపేట ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప మహనీయుడు స్వర్గీయ మీలా సత్యనారాయణ అన్నారు. ఎంతోమంది నిరుద్యోగులకు ఈరోజు మీలా సత్యనారాయణ స్థాపించిన వ్యాపార రంగాలలో జీవనోపాధి పొందుకుంటున్నారని గుర్తు చేశారు వ్యాపార రంగంలో ఎన్నో అవార్డులు రివార్డులు సాధించారని తెలిపారు. నేటి మానవ సమాజానికి అన్ని రకాలుగా మీలా సత్యనారాయణ జీవితం ఆదర్శప్రాయమైనదన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు గూడెపురి ప్రభాకర్ బుక్క ఉపేందర్ దుర్గం బాలు ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin