సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండల కేంద్రానికి చెందిన డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి మిస్సింగ్ అయిన ఘటన కలకలం రేపింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వెంకటాపురం మండల కేంద్రానికి చెందిన యువకుడు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తేదీ సాయంత్రం సుమారు 10:30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతను తిరిగి ఇంటికి రాలేదు. ఎన్నిసార్లు ఫోన్‌కు కాల్ చేసినా స్పందన లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బంధువులు, స్నేహితుల వద్ద ఆరా తీసినా ఎలాంటి సమాచారం లభించకపోవడంతో, చివరకు వెంకటాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు. యువకుడి ఆచూకీ కోసం పరిసర ప్రాంతాల్లో విచారణ చేపట్టడంతో పాటు, అవసరమైతే సీసీ కెమెరాల ఫుటేజ్‌ను కూడా పరిశీలించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది....
-----------------------
Admin