Sunday, 13 September 2026 10:49:47 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కాల్వపల్లి తండా గ్రామంలో తీజ్ పండుగ...

Date : 30 July 2023 12:11 AM Views : 440

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలంలోని కొత్త దొనబండతండ కాల్వపల్లి తండా గ్రామంలో తీజ్ పండుగ బానోతు చంద్రు నాయక్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుపుకున్నారు. బంజారా తండాల్లో పెళ్లి కానీ ఆడపిల్లలు ప్రత్యేకంగా జరుపుకునే పండుగ తీజ్. కాలం మారుతున్న లంబాడీలు మాత్రం తమ సంస్కృతిని సంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. తీజ్ పండుగలో కఠోర నియమాలు, డప్పుల మోతలు కేరింతలు ఆటపాటలు నృత్యాలు అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్లు అనుబంధాలు బావ మరదళ్ల అల్లరి చష్టాలు ఉంటాయి. తొమ్మిది రోజులపాటు వేడుకలు ఘనంగా జరుగుతాయి. సీత్లా పండుగ మంగళవారం అయిపోగానే బుధవారం తండా నాయక్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు అందరూ కలిసి తీజ్ పండుగ చేసుకోవడానికి అందరూ మాట్లాడుకుని అంగడికి వెళ్లి గోధుమలను, శనగలు ఇతర సామగ్రి తెచ్చుకుంటారు. గోధుమల నానబెట్టి దుసేరు తీగలతో బుట్టలను అల్లుతారు. పుట్ట మట్టిని తీసుకొచ్చి అందులో ఎరువును కలుపుతారు. తండా పెద్ద నాయక్ చేత మొదటగా ఆ బుట్టలో మట్టిని పోయించి గోధుమలను చల్లుతారు. తండాలో పాడిపంటలు, పశుసంపద, ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని సీత్లా భవానిని తుల్జా భవాని, మేరామ్మ యాడి దేవతలను పూజిస్తారు. తొమ్మిది రోజులు పాటు ఆ బుట్టలో నీళ్లు పోస్తారు. గోధుమలను నానబెట్టాక అందులో రేగు మూళ్లను గూర్చి వరుసకు బావ వాటిని కదిలిస్తారు. గోధుమ మొక్కలు మంచిగా ములుకెత్తితే పంటలు బాగా పండుతాయని తండా పెద్దలు నమ్మకం. ఏడో రోజు ఢమోళి జరుపుతారు. చురుమో బెల్లంతో కలిపిన నైవేద్యంగా మేరామ్మ యాడికి సమర్పిస్తారు. జంతువులను బలి ఇస్తారు. దీన్నే అక్కడో అంటారు. బలి ఇచ్చిన మాంసాన్ని తండా ప్రజలందరికీ పంపిస్తారు. ఎనిమిదో రోజు పెళ్లి కానీ యువకులు మేరామ్మ యాడి పేరు మీద ఉన్న బట్టను తాచి పెడతారు. ఎనిమిదో రోజు సాయంత్రం యువతిలు తాచి పెట్టిన వాళ్ళను పట్టుకొని, ఊరేగింపుగా బయలుదేరి ,మట్టి బొమ్మలను తయారు చేసిన వాటికి పెళ్లిళ్లు చేస్తారు. గోధుమ మొక్కలను ఎనిమిది రోజులపాటు పూజించి తొమ్మిదవ రోజు నిమజ్జనం చేస్తారు. ఈ ఉత్సవాలను పెళ్లి కానీ ఆడపిల్లలే నిర్వహిస్తారు వీరికి తండా పెద్దలు సోదరులు సహకరిస్తారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు బానోతు విజయ బాల నాయక్, మాలోతు సుజాత సక్రు నాయక్, ఎంపిటిసి బానోతు లక్ష్మి భరత్ నాయక్, మాజీ ఎంపిటిసిలు వీణ నాయక్, దేశ్ పాండు నాయక్, ఉపసర్పంచ్లు పాండు నాయక్, వస్త్రం నాయక్, వార్డు సభ్యులు, తండా పెద్దలు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: