సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ మరియు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇచ్చిన పిలుపు మేరకు వరంగల్ జిల్లా నర్సంపేటలో బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు మరియు నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డ్యాగల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత మూడు సంవత్సరాల నుండి విద్యార్థిని విద్యార్థులకు ఫీజు రియేంబర్స్ మెంట్ స్కాలర్షిప్పులు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ గ్రామీణ ప్రాంత విద్యార్థులు కేవలం ప్రభుత్వం ఇచ్చే ఉపకార వేతనాలు పైన ఆధారపడి విద్యను చదువుకుంటున్నారు. కానీ గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం ఇచ్చే ఉపకార వేతనాలు ఇవ్వకపోవడం వల్ల ప్రైవేట్ కళాశాల సర్టిఫికెట్స్ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు 2023 ఆగష్టు - సెప్టెంబర్ 2025 మార్చి నెల వరకు ప్రభుత్వం ఎదురు చేసిన బకార వేతనాల మంజూరు టోకెన్లు వచ్చి ప్రభుత్వం దగ్గర దాదాపు 800 కోట్లపై చిలుకు పెండింగ్లో ఉన్నాయని నేటికీ వాటికి మోక్షం కలగడం లేదని అన్నారు. ఇంకా మంజూరు కానీ ఉపకార వేతనాలు మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నాయని ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రైవేటు కళాశాలల యాజమాన్యలు విద్యార్థులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. గత అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా పెండింగ్ లో ఉన్న బకాయిలను ఈ సంవత్సరం ఏప్రిల్ 2025 నుండి 2026 మార్చి సంవత్సరానికి గాను 12 నెలల్లోనే బకాయిలు విడతల వారిగా పూర్తి చేస్తామని ప్రకటించి 6 నెలలు కావస్తున్నా ఒక్క రూపాయి కూడా విడుదల చేయక పోవడం దారుణం అని అన్నారు. విద్యార్థుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం నర్సంపేట ఆర్ డి ఓ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చెన్నూరి రవి, ఆచార్య విద్యా సంస్థల చైర్మన్, బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జీజుల సాగర్, జిల్లా నాయకులు తరిగొప్పుల మల్లేష్, యువజన సంఘం నియోజకవర్గ అధ్యక్షులు చెట్టబోయిన రఘు, చెన్నారావుపేట మండల అధ్యక్షులు బర్ల యాకయ్య, దుగ్గొండి మండల నాయకులు కడారి సురేష్ యాదవ్, కొలిపాక సుధాకర్, పట్టణ ఉపాధ్యక్షుడు మద్దెల శ్యామ్ కుమార్ యాదవ్, నర్సంపేట పట్టణ యూత్ అధ్యక్షులు గోపగాని నాగరాజు, జనరల్ సెక్రటరీ చామంతుల రమేష్, చెన్నారావుపేట మండల యూత్ అధ్యక్షులు బోనగిరి శరత్, కార్యదర్శి గొర్రె వంశీ లతో పాటు విద్యార్థిని, విద్యార్థులు, బీసీ సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
-----------------------
Admin