సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : గత పాలకులు నియోజకవర్గంలో ఎన్ని అక్రమాలు, దుర్మార్గాలు చేశారో అన్ని నాకు తెలుసని గత ప్రభుత్వ పాపం కూడా పండిందని కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో శ్రమించి కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో బ్రహ్మాండంగా గెలిపించారని హజరత్ జహంగీర్ పీర్ బాబా దర్గా ఆశీస్సులతో సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ పాలించే విధంగా మొక్కుకున్నానని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మంగళవారం షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కొత్తూరు మండలం హజరత్ జహంగీర్ పీర్ దర్గా పుణ్యక్షేత్రంలో ఎమ్మెల్యే శంకర్ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత పాలకుల హయాంలో ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేసారని ఎమ్మెల్యే శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వారి పాపం పండిందని ఒక మంచి ప్రభుత్వం రాబోతుందని ఆయన అన్నారు. కార్యకర్తలకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అండగా నిలబడ్డారని భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కొండంత అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఎవరు పనిచేశారు ఎవరు పనిచేయలేదు అంతా తెలుసు అని అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని శంకర్ అన్నారు. జహంగీర్ బాబా దయవల్ల అందరూ సుఖశాంతులతో ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం సుదీర్ఘ కాలం పాటు కొనసాగే విధంగా కోరడం జరిగిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో అంతిమ విజయం ప్రజలదేనని ప్రజలు ఎంతో గొప్ప తీర్పు ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతుందని ఆనందం వ్యక్తం చేశారు. బాబా ఆశీస్సులతో తాను కూడా ఎమ్మెల్యేగా గెలిచానని ఈ సందర్భంగా శంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మహమూద్, ఆగిరి రవి గుప్త కుమార్, సయ్యద్ రియాజ్, ఆంజనేయులు మాస్టర్, బాసు నాయక్, బుచ్చిబాబు, జహీరుద్దీన్, కుర్రరవి నాయక్, పంతులు నరసింహ, వై బాబు ముదిరాజ్, కిషన్ నాయక్, ఖాజా, జంగయ్య, శేఖర్, శ్రీరాములు, శేఖర్, ఖలీద్, రహీం, ఈశ్వర్, శ్రీను, సంధాని, రమేష్, నసీర్, లాలూ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin