Tuesday, 15 September 2026 07:57:17 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నేరేడుచర్లలో నయా సైబర్ క్రైం...

Date : 20 May 2024 12:05 PM Views : 577

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నేరేడుచర్ల మండల కేంద్రంలో హలో నేను ఏఎస్ఐ ని మాట్లాడుతున్నా... మా ఎస్ఐ కూతురికి యాక్సిడెంట్ అయింది. రూ 75 వేలు పంపిస్తున్నా వెంటనే ఫోన్ పే ద్వారా నాకు తిరిగి ఆ మొత్తాన్ని పంపండి అంటూ ఫేక్ కాల్ చేసి ఇరువురు వ్యక్తులను మోసగించి ఓ గుర్తుతెలియని ఆగంతకుడు సైబర్ నేరానికి పాల్పడిన సంఘటన నేరేడుచర్లలో వెలుగు చూసింది.ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. రాత్రి సమయంలో నేరేడుచర్లలోని ఓ బంక్ యజమానికి నేను ఏఎస్ఐ ని మాట్లాడుతున్నా నని ఫోన్ వచ్చింది. మా ఎస్ఐ కూతురికి యాక్సిడెంట్ అయింది. నా దగ్గర నగదు మాత్రమే ఉంది. రూ 75 వేలు పంపుతున్నాను "నా అకౌంట్ లోకి ఫోన్ 'పే ద్వారా పంపండి అని ఫోన్ వచ్చింది. దీంతో ఆ బంక్ యజమాని నా వద్ద ఫోన్ పే లేదని సమాధానం చెప్పడంతో మీకు తెలిసిన వారి నుండి పంపించండని ఆదేశించాడు. దీంతో సదరు బంకు యజమాని పట్టణానికి చెందిన మిత్రుడి నెంబరు ఇచ్చాడు.ఆగంతకుడు మిత్రుడి నెంబర్ కి ఫోన్ చేయగా ఆ మిత్రుడి వద్ద సరిపోను మొత్తం లేకపోవడంతో మరో వ్యక్తిని పిలిపించుకొని ఇరువురు ఫోన్ పే ద్వారా ఆగంతకుడు చెప్పిన మరో పెట్రోల్ బంక్ సిబ్బంది అకౌంట్ కు పంపించాల్సిందిగా చెప్పాడు. తిరిగి ఆగంతకుడు పెట్రోల్ బంక్ సిబ్బందికి ఫోన్ చేసి నీకు ఖాతాకు డబ్బు చేరిందని నేను పంపిన క్యూఆర్ కోడ్ కు డబ్బు పంపమని చెప్పగా పంపించాడు. ఏఎస్ఐ పంపిస్తానన్న డబ్బు రాకపోవడంతో తాము మోసపోయామని గ్రహించి 1930 సైబర్ క్రైమ్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :