Thursday, 30 July 2026 08:13:18 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జమాతె ఇస్లామ్ హింద్ ఖమ్మం శాఖ ఆధ్వర్యంలో రంజాన్ స్వాగత సభ...

Date : 12 March 2023 11:22 PM Views : 851

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : దివ్యఖుర్ఆన్ బోధనలు మానవాళికి ఇహంలోనూ, పరంలోనూ దారిచూపుతాయని, మంచి, చెడుల విచక్షణ చూపే ఈ గ్రంథం రమజాన్ నెలలో అవతరించిందని అందుకుగాను రంజాన్ నెలకు ప్రాముఖ్యం లభించిందని జమాఅతె ఇస్లామీ హింద్ రాష్ట్ర కార్యదర్శి జనాబ్ అబ్దుల్ బాసిత్ అన్వర్ అన్నారు. రాబోయే రమజాన్ నెలను పురష్కరించుకొని స్థానిక కార్యలయంలో నిర్వహించిన రమజాన్ నెల స్వాగత సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి జనాబ్ అబ్దుల్ బాసిత్ అన్వర్ మాట్లాడుతు దివ్యఖుర్ఆన్ సమస్త మానవాళికంతటికి మార్గదర్శక గ్రంధమన్నారు. దైవుని అభిష్టం, మానవుని జీవన విధానం తెలియజేసే పవిత్ర గ్రంధమే దివ్వ ఖుర్ఆర్. ఆల్లాహ్ ఆదేశాలు బోధనలు లోకానికి అందించిన అధ్యాత్మిక సారం. ఖుర్ఆన్ అంటే పఠించే గ్రంధం. ఈ మాసంలో అధికంగా ఖుర్ఆన్ను ఏకాగ్రతతో అర్ధం చేసుకుంటూ పఠించాలి దైనందిన కార్యక్రమాలకు తక్కువ సమయాన్ని కేటాయిస్తు మిగిలిన కాలమంతా దైవనామ స్మరణ, ఖుర్ఆన్ పఠన ఆరాధనల్లో గడపాలని అన్నారు. ప్రకృతి వనరులైన గాలి, నీరు, సూర్యరశ్మి ఏవిధంగా మానవాళి సొంతమో ఖుర్ఆన్ గ్రంథమూ అందరి సొంతమని, ఇది ఏ ఒక్కరి సొత్తూ కాదని ఆయన అన్నారు. అనంతరం రాష్ట్ర సహాయ కార్యదర్శి జనాబ్ మహమ్మద్ అబ్దుల్ బారి మాట్లాడుతు రంజాన్ మాసం అందరికి శుభాలు. క్రమశిక్షణ, సహనం, దాతృత్వాల కలయికే రంజాన్ నెల అన్నారు. ఉపవాసాల ప్రత్యేకత, జకాత్ ప్రాముఖ్యత గురించి ముస్లింలకు అవగాహన ఉండాలన్నారు. రంజాన్ నెలలో ఉపవాసం ఉంటు గర్వం, ఈర్ష్య, చాడీలు చెప్పడం, అసత్యాన్ని పలకడం, అసత్యాన్ని ఆచరించడం మాననివారు ఉపవాసం పాటిస్తున్నట్లు కాదన్నారు. అందుకే ప్రతి వ్యక్తి భక్తిశ్రద్ధలతో ఉపవాసం పాటించాలని అన్నారు. రంజాన్ నెలలో ఉపవాసాలు ఉంటూ ఏ విధంగా అయితే సత్కార్యాలు ధానధర్మాలు చేస్తున్నాము మిగతా కాలంలో కూడా అలాగే ఉండాలని అన్నారు. అనంతరం జమాఅతె ఇస్లామీ హింద్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ ఇలియాస్, హైదరాబాద్ జమాఅతె ఇస్లామీ హింద్ సభ్యులు జనాబ్ భధర్ ఫారూఖీ జనాబ్ హఫీజ్ సలావుద్దీన్ , జనాబ్ ముస్తాఖ్ అలీ రమజాన్ నెల గురించి ప్రసంగించారు. ఈ కార్యాక్రమములో అర్బన్ జిల్లా అధ్యక్షులు అబ్రార్ అలీ, రూరల్ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ ముజీబ్, ఖిల్లా అధ్యక్షులు ఖలీల్ అహ్మద్ ఖాన్, ఇస్లాంపేట అధ్యక్షులు అబ్దుల్ సుబర్, ఇందిరానగర్ అధ్యక్షులు జమీల్ అహ్మద్ ఖాన్ సభ్యులు నిహల్ అహ్మద్, రఫీ, మునీర్, జైనుల్ పాషా , నిజాముద్దీన్, అబ్దుల్ సమి, అబ్దుల్ మలిక్, యుసూప్ షరీప్, అబ్దుల్ రజాక్, గౌస్, ఎస్ ఐ ఓ పట్టణ అధ్యక్షులు ఆమెర్ కార్యదర్శి పైజాన్, మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ జిల్లా అధ్యక్షులు షేక్ ఖాసిమ్ కార్యకర్తలు తదతరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: