సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ డివిజన్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొత్తూరు ఏరియాలోని హెల్త్ వెళ్లే సెంటర్లు ఇనమ్ములనర్వ మరియు సేరిగూడ భద్రాయపల్లిలో జరుగుతున్న హెల్త్ మేళా ప్రోగ్రామ్ డాక్టర్ ఎస్. జయలక్ష్మి సందర్శించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛత అభియాన్, ఎన్ సిడి స్క్రీనింగ్ ఇమ్మనైజేషన్, టెలికాన్సల్టేషన్ వెల్నెస్ ఆక్టివిటీస్ మరియు పరిశుభ్రత గురించి హెల్త్ మేలాకు వచ్చిన పేషంట్లతో వారికి అవగాహన కల్పించారు. స్వచ్ఛత అభియాన్ లో భాగంగా ప్రతి ఒక్కరూ వారి ఇంటి చుట్టు ప్రక్కల మరియు ఇంటిలో పరిశుభ్రత మరియు వ్యక్తిగత పరిశుభ్రత పాటించినట్లయితే ఎలాంటి రోగాలకు దారి తీయకుండా ఉండవచ్చని తెలియజేశారు. ఎన్. సి. డి స్క్రీనింగ్ లో బయటపడిన భి.పి పేషెంట్లు మరియు షుగర్ పేషెంట్లకు ఆ వ్యాధి గురించి అవగాహన కల్పించి, బీ.పీ కి మరియు షుగర్ కు తగిన మాత్రలు మీ గ్రామంలో ఉన్నాయి అని, ఈ హెల్త్ వెల్నెస్ సెంటర్లోనే లభిస్తున్నాయని వాటిని మీరందరూ వినియోగించుకోవాలని తెలియజేశారు. ఇమ్నైజేషన్ పుట్టిన పిల్లవాడి నుండి సంవత్సరంలోని పిల్లలందరికీ కూడా క్రమము తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించాలని సూచించారు. అలాగే గర్భవతులు కూడా తప్పకుండా నెల సూధులు తీసుకోవాలని తెలియజేశారు. వెల్నెస్ ఆక్టివిటీస్ లో భాగంగా యోగా, నడక, సైక్లింగ్ మరియు బ్రీతింగ్, ధ్యానము పాటించినట్లయితే ఎలాంటి రోగాలు దరిచేరకుండా ఉంటాయని, మన యొక్క ఆయుష్ పెరుగుతుందని డాక్టర్ ఎస్ జయలక్ష్మి తెలియచేశారు. మరియు మన గ్రామంలో కొన్ని వ్యాధులకు అందుబాటులో చికిత్స ఇవ్వలేని సమయంలో, టెలికాన్సల్టేషన్ ద్వారా స్పెషలిస్టు సర్వీసులను వినియోగించుకోవాలని అక్కడికొచ్చిన ప్రజలకు తెలియచేశారు. ఇక్కడ చెప్పిన విషయాలన్నీ కూడా మీ ఇంటి చుట్టుపక్కల వారందరికీ కూడా తెలియ జేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ జే శ్రీనివాసులు, సిహెచ్ ఓ చిట్టిబాబు, ఎం. ఎల్.హెచ్.పి వైద్యాధికారులు మానస రామ్ నాయక్, హెల్త్ సూపర్వైజర్ అనసూయ ఏఎన్ఎంలు మరియు ఆశలు పాల్గొన్నారు.
-----------------------
Admin