Thursday, 30 July 2026 02:37:38 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఆర్మూర్ మున్సిపాలిటీ చైర్మన్ పై సొంత పార్టీ కౌన్సిలర్స్, బిజెపి,కాంగ్రెస్, ఎంఐఎం కౌన్సిలర్ల అవిశ్వాస తీర్మానంనెగ్గింది...

Date : 05 January 2024 03:51 AM Views : 5049

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో గురువారం రోజున ఆర్మూర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ పండిత్ వినిత పవన్ పైన ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది... 12 డిసెంబర్ 2023 నాడు కౌన్సిలర్లు సమర్పించిన అవిశ్వాస తీర్మానంపై పరిశీలించుటకై మున్సిపల్ కౌన్సిలర్స్ సమావేశం తేదీ 4 జనవరి 2024 ఉదయం 11 గంటలకు ఆర్మూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ప్రొసీడింగ్ అధికారి రెవెన్యూ డివిజన్ అధికారి వినోద్ కుమార్, ఆర్మూర్ కమిషనర్ ప్రసాద్ చౌహన్ , ఎక్స్ అఫీషియో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ 30 డిసెంబర్ 2023 నాడు ఆర్డీవోను నియమించడం జరిగింది. మున్సిపాలిటీ కౌన్సిలర్లు 36 సభ్యులు ఉండగా 10 మంది కౌన్సిలర్లు ఇట్టి కార్యక్రమంలో హాజరు కాలేరు. బి ఆర్ ఎస్ పార్టీ కౌన్సిలర్లు 17, బిజెపి పార్టీ కౌన్సిలర్లు నలుగురు, ఎంఐఎం కౌన్సిలర్ ఒకటి, ఇతర కౌన్సిలర్లు ఇద్దరు మొత్తం24 కౌన్సిలర్లు ఆర్మూర్ మున్సిపాలిటీ చైర్మన్ పండిత్ వినీత పవన్ పై అసమ్మతి అవిశ్వాస తీర్మాన ప్రవేశపెట్టారు. ఆర్మూర్ ఆర్డీవో వినోద్ కుమార్ అవిశ్వాసం బలపరీక్షలో నెగ్గిన కోరం సభ్యులు. మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీత పవన్ ను పదవి నుంచి తొలగించారు. అవిశ్వాసం పెట్టిన కౌన్సిలర్లు. ఇట్టి కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆర్మూర్ ఏసిపి జగదీష్ చందర్, ఆర్మూర్ తాసిల్దార్, ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సూరిబాబు, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చవాన్ రెవెన్యూ మున్సిపాలిటీ అధికారులు పాల్గొన్నారు. మీడియా విలేకరులతో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ అవిశ్వాసం నెగ్గిందని, అవినీతిపై విజయం సాధించామని అన్నారు. తాను రాజకీయంలోకి అడుగు పెట్టిన తర్వాత రెండో వికెట్ పడ్డదన్నారు. ఆర్మూర్ ప్రజలు కోరుకుంటున్నట్లు అవినీతిని అంతం చేసి ఆర్మూర్ ప్రజలు అభివృద్ధికై నూతన ఓరవడి ప్రారంభమైందన్నారు. మీ బిజెపి పార్టీ నుండి చైర్మన్ పదవికి పోటీలో ఉన్నారా అని అడగ్గా చైర్మన్ పదవులు వాటంతట అవే వస్తాయని అన్నారు. అవిశ్వాసానికి ప్రత్యేక అధికారిక వ్యవహరించిన ఆర్మూర్ ఆర్డీవో వినోద్ కుమార్ మాట్లాడుతూ 17 మంది బి ఆర్ ఎస్ కౌన్సిలర్లు, నలుగురు బిజెపి కౌన్సిలర్లు, ఎంఐఎం కౌన్సిలర్ ఒకటి ఇతర కౌన్సిలర్లు ఇద్దరు మొత్తం 24 కౌన్సిలర్లు అవిశ్వాసానికి పూర్తి మద్దతు ప్రకటించి అవిశ్వాసాన్ని నెగ్గారు అన్నారు. నివేదిక సమర్పించిన తదుపరి కార్యాచరణ కొత్త చైర్మన్ పదవి ఎన్నిక వాటిపై నిర్ణయాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్ నిర్ణయ మేరకు కొత్త చైర్మన్ ఎన్నిక జరుగుతుందన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: