Wednesday, 29 July 2026 04:49:03 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జనం మధ్యలో ఉండే సైదన్న కావాలో... ఢిల్లీ - హైదరాబాద్ తిరిగే ఉత్తమ్ కావాలో... ప్రజలు ఆలోచించాలి

Date : 22 October 2023 08:09 AM Views : 273

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజుర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి మండలం.. బీఆర్ఎస్ పార్టీ బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు .మఠంపల్లి బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఇరుగు పిచ్చయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి హుజుర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి పాల్గొని, కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మఠంపల్లి మండల సమన్వయ కమిటీ సభ్యులు, బూత్ ఇంచార్జిలు, గ్రామ ఇంచార్జిలు, సర్పంచులు, ఎంపిటిసిలు, గ్రామ శాఖ అధ్యక్షులు, ముఖ్య నాయకులతో కలిసి, బూత్ స్థాయి కమిటీ సమావేశంలో పాల్గొని,నాయకులకు ,కార్యకర్తలకు,బూత్ కమిటీ సభ్యులకు వారు చేయాల్సిన విధానం తెలిపి, వారి బాధ్యతలు వారికి అప్పజెప్పి దిశా నిర్దేశం చేసి,బూత్ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలతో కలసి సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల ప్రచారం, కార్యచరణలో భాగంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేసి, ప్రతి ఒక్కరు ఇంటింటికి డోర్ టు డోర్ ప్రచారం చేయవలసిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో భాగంగా బూత్ కమిటీ సభ్యులకు అందరికీ ఆహ్వానం పలుకుతూ,ప్రతి ఒక్కరికి 100 ఓట్ల బాధ్యతలు అప్పజెప్పడం జరిగింది.రాష్ట్రం లో గత తొమ్మిదేళ్లుగా అభివృద్ధి కొనసాగుతున్నది. సీఎం శ్రీ కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి మళ్ళీ ఆశీర్వదించాలని, పార్టీ బలోపేతానికి కృషి చెయ్యాలని కోరారు. కేసీఆర్ నాయకత్వంలో పార్టీ కోసం కలిసికట్టుగా పని చెయ్యాలని, పేదల అభ్యున్నతికి మన బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంది అని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. రైతులకు నిరంతరం కరెంట్ అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని అన్నారు. రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంది అని ఆయన అన్నారు. గ్రామాల్లో గతంలో అడుగంటిన చెరువులన్నీ ప్రస్తుతం జలకళ తో దర్శనమిస్తున్నాయని అన్నారు.ప్రతి పల్లెకు పక్కా రోడ్డును నిర్మించాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తున్నదని అన్నారు. గ్రామాల్లోనూ మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని అన్నారు.రైతులకు పంట పెట్టుబడి సాయం చేయాలనే ధృఢ సంకల్పంతో రైతు బంధు, రైతు బీమా,కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి వంటి చారిత్రాత్మక పథకాలను సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారని అన్నారు. హుజుర్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని అన్నారు. నియోజకవర్గం లో మరోసారి గులాబీ జెండా ఎగురవేసి, మన సత్తా చూపించాలని అన్నారు. మన నియోజకవర్గ పరిధిలో మన పార్టీ ప్రజా ప్రతినిధులు 80% ఉన్నారు. మన హుజుర్ నగర్ లో మొత్తం 140 గ్రామ పంచాయతీల్లో 125 మంది సర్పంచ్ లు మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. గెలిచిన తర్వాత ఆరు నెలల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ తర్వాత అతి పెద్ద ప్రాజెక్ట్ 2వేల కోట్లతో మన హుజుర్ నగర్ వెల్లటూర్ లో లిఫ్ట్ ఏర్పటు చేయబోతున్నాము. పోయేవాళ్లను బ్రతిమిలాడే పరిస్థితి లో మనం లేము, మన పార్టీ లేదు భారీ మెజార్టీతో గెలవడం ఖాయం బ్రోకర్స్ సిస్టమ్ మన దగ్గర ఉండదు.దొంగలకు సైదిరెడ్డి దగ్గర పని చేయడం కుదరదు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే ఒక్కొక్క ఊరు 20సార్లు వెళ్లిన ప్రతి గ్రామానికి 1 కోటి నుంచి 5 కోట్ల పనులు చేసినం కొందరు మన పార్టీకి పని చేసే వారు కాదు కాబట్టి వేరే పార్టీకి వెళ్లారు. నూతన రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేసినం మనం అన్ని ఊర్లలో చాలా బలంగా ఉన్నాము. వేలాది కోట్ల రూపాయల నిధులు తెచ్చి పని చేసినాము.ఈ కార్యక్రమంలో.. మండల, స్థానిక ప్రజా ప్రతినిధులు,ఎంపీపీ అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, గ్రామ శాఖ పార్టీ అధ్యక్షులు, సమన్వయ కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :