Saturday, 12 September 2026 07:33:56 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మేళ్లచెరువు జాతర ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలి...

Date : 05 March 2024 12:10 PM Views : 271

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ఈ నెల 8న మహాశివరాత్రి సందర్బంగా నిర్వహించనున్న మేళ్ళచెర్వులోని స్వయంభు శంభు లింగేశ్వర స్వామి జాతరకు ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలి జిల్లా అదనపు కలెక్టర్‌ రెవెన్యూ బిఎస్‌.లత తెలిపారు.సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జాతర ఏర్పాట్లపై జిల్లా అడిషనల్‌ ఎస్పీ నాగేశ్వరావుతో కలిసి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ జాతరకు పకడ్బందీ ఏర్పాటు చేయాలని. శాఖల వారీగా నిర్దేశించిన పనులను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. వాహనాల పార్కింగ్, ఆలయ ప్రాంగనంలో బారికేడ్ల ఏర్పాటు చేయాలని ఆర్‌ అండ్‌ బి అధికారులను ఆదేశించారు. గుడి ప్రాంగణంలో లైటింగ్‌ బార్కెట్స్‌ ఏర్పాటు చేయాలని, ఆలయ ప్రాంగనం చుట్టూ చదును చేసి ప్రభల ఏర్పాట్లకు సిద్దం చేయాలని పంచాయతీరాజ్‌ అదికారులను ఆదేశించారు. భక్తులకు సౌకర్యార్థం అన్ని రూట్లో బస్సులను నడపాలని ఆర్‌టిసి అధికారులకు సూచించారు. శానిటేషన్, భక్తులకు త్రాగునీరు ఏర్పాట్లు పరిశీలించాని డిఎల్‌పిఓ, ఎంపీడీవోలు ,తాహశీల్దార్‌లకు సూచించారు. తాత్కాలిక టాయిలెట్స్‌ నిర్మాణం, మహిళల కొరకు ప్రత్యేకంగా షీ– టాయిలెట్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. దేవాలయం చుట్టుపక్కల నిరంతర కరెంటు ఉండేటట్లుగా విద్యుత్‌ శాఖ అధికారులు ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల సేవల కొరకు ఎన్జీవోలను, ఎన్‌సీసీ విద్యార్థుల సేవలను ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారి రూపేందర్‌ సింగ్, సూపరిడేంట్‌ పద్మారావు, రోడ్డు భవనాల శాఖ అధికారిని ప్రియదర్శిని, ఎంపీడీవో ఆలీ , ఆర్టీసీ డిఎం సురేందర్, తాహశీల్దార్‌ జ్యోతి ,అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: