Saturday, 18 April 2026 08:07:58 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

గెలుపు ఓటములు సమానంగా తీసుకోవాలి....

Date : 21 November 2022 12:39 AM Views : 534

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ :- ఈనెల 19 నుండి 20 వరకు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల క్రీడా మైదానంలో జరిగిన ఏడవ రాష్ట్ర సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినిత పవన్ గారు విచ్చేసి క్రీడాకారులకు బహుమతులు అందజేసి క్రీడాకారులు ఉద్దేశించి మాట్లాడుతూ గెలుపు ఓటములు సమానంగా తీసుకోవాలి, గెలిచిన క్రీడాకారులు అదే స్ఫూర్తితో ముందుకు సాగాలి ఓటమి చెందిన క్రీడాకారులు అధైర్య పడకుండా గెలుపు కోసం ప్రయత్నం చేయాలి, ఈ కంప్యూటర్ యుగంలో తల్లిదండ్రులు తమ పిల్లలని సెల్ ఫోన్లకు అంకితం కాకుండా క్రీడా మైదానానికి ఉదయం సాయంత్రం పంపుతూ ఇష్టమైన క్రీడల్లో తప్పనిసరి పాల్గొనేలా చూస్తే తమ పిల్లలు ఆరోగ్యం వంతులుగా రాణిస్తారు, ఆర్మూర్ క్రీడలకు అడ్డా అని గుర్తు చేస్తూ ఎందరో ఆర్మూర్ ప్రాంత క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ పోటీలలో పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో క్రీడలకు మరింత ప్రోత్సాహం ఇస్తానన్నారు. జాతీయ సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్లో ఈనెల 25 నుండి 29 వరకు జరగనున్న జాతీయ పోటీలలో రాష్ట్ర జట్టుని ప్రథమ స్థానం తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాఫ్ట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కే శోభన్ బాబు, పాఠశాల ప్రిన్సిపల్ దుర్గారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నాభాయ్, రాష్ట్ర సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కోశాధికారి అభిషేక్ గౌడ్, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నరసయ్య, జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్, సంయుక్త కార్యదర్శి మరికంటి సుజాత, బీసీ సంఘం అధ్యక్షులు అశోక్ గౌడ్, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజా గౌడ్, మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ అజయ్ గౌడ్, వివిధ జిల్లాల కార్యదర్శులు, సీనియర్ ఉపాధ్యాయులు తేజు, రవి, సూర్య, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు ఎస్ వినోద్, రంజిత్ ,సంతోష్ ,అన్వేష్ మహేష్ మరియు సాఫ్ట్ బాల్ అకాడమీ కోచ్ నరేష్ పాల్గొన్నారు. విజేతలు:- ప్రథమ స్థానం మెదక్, ద్వితీయ స్థానం నిజామాబాద్, తృతీయ స్థానం మంచిర్యాల , ఈ టోర్నీలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రత్యేక బహుమతులు అందుకున్న క్రీడాకారులు:- 1) డి వినీష్ నిజామాబాద్, 2) మహిపాల్ మెదక్, 3) శశాంక్ మంచిర్యాల్, 4) లక్వేందర్ కామారెడ్డి.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :