సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నారాయణపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వివిధ ముఖ్య కార్యకర్తల సమావేశంలో SFI జిల్లా కార్యాలయంలో SFI జిల్లా అధ్యక్షుడు మోహన్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి SFI తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటి కొండా రవి ముఖ్యఅతిథిగా హాజరై వారు మాట్లాడుతూ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2023 సంవత్సరం బడ్జెట్లో ఇటీవలి కాలంలో లేవనెత్తిన దాదాపు అన్ని విద్యారంగ అవసరాలను మరియు దేశ విద్యార్థుల, సంస్థల డిమాండ్లను విస్మరించిందని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటి కొండా రవి వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యారంగానికి ఈ బడ్జెట్లో నిర్దిష్ట ప్రకటన ఏమి బిజెపి ప్రభుత్వం చేయలేదు అన్నారు. ఇది ప్రభుత్వ విద్యాపై ఉన్న నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుందన్నారు. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మొత్తం బడ్జెట్ ప్రసంగంలో ఒక్కసారి కూడా 'ప్రభుత్వ విద్యా' అనే పదాన్ని ప్రస్తావించలేదు అన్నారు. దీనిని బట్టి ఎంత నిర్లక్ష్యం ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. బడ్జెట్ ప్రసంగం మొత్తం విద్య ప్రభుత్వ బాధ్యత అనే భావన నుండి ప్రభుత్వం తప్పుకుంటున్నట్లు ఉందని అన్నారు. గత బడ్జెట్లో విద్యారంగానికి ఆర్థిక సంవత్సరం 2022 - 23 బడ్జెట్ అంచనా మొత్తంలో 2.64 శాతం కేటాయింపు చేస్తే ఈ బడ్జెట్ అంచనాలలో 2.50% తగ్గింది అలాగే జీడిపిలో 3 శాతం కూడా హామీ ఇవ్వలేదన్నారు. ఇది ప్రభుత్వం తీసుకునే వస్తున్న నూతన విద్యా విధానం అమలు చేయడానికి వాగ్దానం చేసిన దానిలో సగం మాత్రమే, జాతీయ విద్యా మిషన్ కు బడ్జెట్లో 600 కోట్లు కేటాయించారు. ఇది కూడా గత బడ్జెట్ కంటే తక్కువ అన్నారు. విద్యా సాధికారత కోసం గత బడ్జెట్ నుండి 826 కోట్లు చేశారు. ప్రస్తుత దాని ప్రస్తావన లేదు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాల ఫలితంగా ఏర్పడినవి ప్రతి సంవత్సరం మీ అసమానతలు పెరుగుతున్నాయి. ఈ అసమానతలు ఎందుకంటే విద్యా రంగంలో గత కొన్ని సంవత్సరాలు నుండి అమలు చేస్తున్న నయా,ఉదారవాద విధానాలు ఫలితంగా విద్యా ప్రైవేటీకరణకు దారి తీసిందని అన్నారు. మరి అట్టడుగు వర్గాల విద్యార్థులకు చదువు వెళ్లకుండా నెట్టివేసింది అన్నారు. కేంద్ర ప్రభుత్వం యొక్క అత్యంత విద్యార్థి వ్యతిరేక బడ్జెట్ పై ఎస్ఎఫ్ఐ అత్యంత తీవ్రమైన నిరసన తెలియజేస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేంద్ర విద్యాసంస్థల నిర్లక్ష్యం చేసింది ఐఐటి హైదరాబాద్ మన టిసి లాంటి విద్యాసంస్థల అభివృద్ధి కోసం తగిన బడ్జెట్ లేదన్నారు. తెలంగాణ విద్యా రంగానికి తీవ్ర నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పిలుపునిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరహరి, జిల్లా గర్ల్స్ కన్వీనర్ సుశీల, ఉపాధ్యక్షులు కాశి, సహయకార్యదర్శి రవి, SFI జిల్లా నాయకులు నరేష్, పవన్, వెంకటేష్, మహేష్ ,అక్షిత్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin