సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ప్రపంచానికి అహింసా సిద్ధాంతాన్ని చాటి చెప్పిన మహనీయుడు జాతిపిత మహాత్మాగాంధీ అని కలెక్టర్ ప్రియాంక అలా అన్నారు. సోమవారం గాంధీ జయంతి సందర్భంగా కలెక్టరేట్ లో గాంధీ జయంతి వేడుకలకు ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల మాట్లాడుతూ మహాత్మాడు ఏది చెప్పారో అది ఆచరించారని తెలిపారు. అహింసా సిద్ధాంతాన్ని నమ్మి ప్రపంచ దేశాల మద్దతు పొందారని తెలిపారు. అహింసతోనే ఏదైనా సాదించవచ్చుని నమ్మి భారత దేశానికి స్వాతంత్య్రం తీసుకు వచ్చిన మహానీయుడు గాంధీ అని కొనియాడారు. దేశానికి పట్టుకొమ్ములు గ్రామాలని చెప్పారని తెలిపారు. గ్రామాల అభివృద్దితోనే దేశ ప్రగతి సాధిస్తుందని చెప్పారన్నరు. అంటారాని తనం నిర్మూలనకు ఎంతో కృషిచేశారన్నారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గాంధీ కలలు కన్న ఆశయాలు కోసంకృషి చేస్తున్నాయని తెలిపారు. స్వచ్చాభారత్ పథకాన్ని మిషన్ కొనసాగిస్తున్నారని తెలిపారు. విదేశాల్లో చదువు ముగించుకుని భారత దేశానికి తిరిగి వచ్చిన తరువాత గాంధీ మహాత్ముడు దేశం మొత్తం పర్యటించి, దేశంలోని ప్రజలు ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు. గ్రామాలు ఎలా ఉ న్నాయి, వారి జీవిన విధానం ఎలా ఉందని ఆనాడే సునిశితంగా పరిశీలన చేశారని తెలిపారు. అపరిశుభ్రత వలన గ్రామీణ ప్రజలు ఆనారోగ్యం భారిన పడుతున్న విషయాన్ని గమనించారు. ఆయన ఆశయాలు నేడు ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయన్నారు. వాటిని కింద స్థాయి ప్రజలకు అందేవిధంగా పనిచేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం జిల్లాలోని ఇతర అధికార యంత్రాంగానికి రోల్ మోడల్గా ఉండే విధంగా కలెక్టరేట్ ఉద్యోగులు మహాత్ముని జీవితంలో చూపిన విధంగా చిత్త శుద్దితో, మనుసు పెట్టి పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి రాంబాబు, పిడి డిఆర్డిఏ మధుసూదన్ రాజు, జిల్లా రెవెన్యూ అధికారి రవీంద్రనాథ్, ఏఓ గన్యా, జిల్లా అధికారులు మరియు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin