సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గిరిజన ఉత్సవాలను శనివారం మఠం పల్లి మండలంలోని అన్ని తండా గ్రామ పంచాయతీలో గిరిజన దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని మండల ఎంపిపి మూడవతు పార్వతికొండానాయక్ తెలిపారు. హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానం పూడి సైది రెడ్డి సహాయ సహకారాలతో మఠంపల్లి మండలంలోని అన్ని తండా గ్రామ పంచాయతీలకు లింకు రోడ్లు, హుజూర్ నగర్ టౌన్ బంజారా భవన్, గిరిజన ఆశ్రమ పాఠశాల, మంచ్యాతండ రైల్వే స్టేషన్ కు శ్రీ సంత్ సేవాలల్ మహరాజ్ పేరు మీద సేవాలల్ మహరాజ్ రైల్వే స్టేషన్ గా నామకరణం చేయడం జరిగింది. ఎమ్మెల్యే శానం పూడి సైది రెడ్డి గిరిజనుల అభివృద్ధే ధ్యేయంగా, తండా అభివృద్ధే లక్ష్యంగా చేసుకొని అభివృద్ధి చేస్తున్నారని ఎంపిపి మూడవతు పార్వతికొండానాయక్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు.
-----------------------
Admin