Monday, 14 September 2026 12:57:41 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గ్రామపంచాయతీ వర్కర్స్ మూడు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి...

Date : 21 February 2023 01:30 AM Views : 967

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : నారాయణపేట జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న గ్రామపంచాయతీ వరకు మూడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. వెంటనే మూడు నెలల వేతనాలు చెల్లించాలని ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులు ఎస్ కిరణ్ అన్నారు. ఈరోజు తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రి. నెం హెచ్-106 (ఐ ఎఫ్ టి యు) ఆద్వర్యంలో నారాయణపేట జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి ఏ. నరసింహ ఆ సంఘం జిల్లా అధ్యక్షులు అధ్యక్షత వహించగా ముఖ్యవక్తగా ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులు ఎస్ కిరణ్,వక్తలుగా ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి బి నరసింహ, ఐ ఎఫ్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు ఎ జీ భుట్టో, ఐ ఎఫ్ టి యు జిల్లా కోశాధికారి రామాంజనేయులు లు మాట్లాడుతూ గ్రామపంచాయతీ వర్కర్స్ పెండింగ్లో ఉన్న మూడు నెలల జీతాలు వెంటనే వేయాలని కార్మికులకు పని భారాన్ని తగ్గించాలని మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి. నిత్యవసర సరుకుల ధరలు రోజురోజుకు పెరిగిపోయి కొనలేని స్థితికి ఏర్పడ్డాయని అన్నారు. ప్రస్తుతం ఇచ్చే 8500 వేతనం పెరిగిన ధరలకు ఏమాత్రం సరిపోలేదని కనీస వేతనం 26000 అమలు చేయాలన్నారు. వారంతా సెలవులు ఇవ్వాలని కార్మికులకు కనీస అవసరమైన శానిటైజర్స్ సబ్బులు, నూనె, గ్లౌజులు, బూట్లు డ్రెస్సులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికులను రెగ్యులరైజ్ చెయ్యాలి పని భారాన్ని తగ్గించాలి అదనపు సిబ్బందిని నియమించాలి సామాజిక భద్రత కల్పించాలి ఈఎస్ఐ,పిఎఫ్ చట్టాలను అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పిఆర్సి ప్రకారం 30% ఫిట్మెంట్ గ్రామపంచాయతీ కార్మికులకు వర్తింపజేయాలి విడుదల చేసిన ఐదు జీవోలు 21 నుంచి 25 లను వెంటనే రాజపత్రం గెజిట్ ముద్రించాలి , ఇన్సూరెన్స్ ప్రమాద మరణానికి 10 లక్షలు సహజ మరణానికి ఐదు లక్షల బీమా పథకాన్ని అమలు చేయాలి అని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించే పద్ధతిని తీసుకురావాలని వారు కోరారు. ధర్నా అనంతరం తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కోయ హర్ష గారికి ఇవ్వడం జరిగింది. స్పందించిన కలెక్టర్ వెంటనే డిపిఓ గారి ద్వారా వేతనాలు వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు డి నరసింహ, తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ గుండుమల్ రాములు, నర్వ రామచంద్రి, శాసనపల్లి వెంకటయ్య, నర్సోజి శ్రీనివాస్ గౌడ్, పాటి నరసింహ నరసింహ, రఫీ, మైపాల్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: