సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల్ దేవర చెరువు మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడైనటువంటి తెలుగు యువత ఓబుల్ రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి హాస్పిటల్లో చికిత్స పొంది వారి స్వగ్రామంలో విశ్రాంతి తీసుకుంటున్న ఆ విషయం తెలుసుకొని శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ పరామర్శించారు.ఈ సందర్భంగా సామకోటి ఆదినారాయణ మాట్లాడుతూ...తెలుగుదేశం పార్టీ నాయకులకు,పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని,ఎవరు కూడా ధైర్యం కోల్పోవద్దని,పార్టీ అండదండలు సహాయ సహకారాలు తెలుగుదేశం పార్టీ తరఫున ఎప్పుడు ఉంటాయని ఆయన తెలియజేశారు. *ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కో ఆప్షన్ నెంబర్ నిజాంవలి,ఐటీడీపీ నియోజకవర్గ ఓడిసి మండల అధ్యక్షులు కుమార్ రాయల్,ఆకుతోటపల్లి హరికృష్ణ,దిగువపల్లి ప్రసాద్,బాల్ రెడ్డి,నల్లమాడ అరవింద్,నారాయణస్వామి,యశ్వంత్,సుధాకర్ తదితరులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
-----------------------
Admin