సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ / అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని హుజూర్ నగర్ పట్టణం లోని ఆర్కిడ్స్ స్కూల్ నందు ఘనంగా యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ గెల్లి రవి మాట్లాడుతూ యోగా అనేది శారీరక మానసిక వికాసానికి తోడ్పడుతుందని, మన పూర్వీకుల నుండి వచ్చిన ఆచారాలలో ఒకటైన యోగా, ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు మానసిక ఉత్సాహం పెంపొందుతుందని అని అన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు విద్యార్థులు యోగాసనాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏవో రాము, ఇన్చార్జి ప్రసాద్, పీఈటి నాగు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్వాయి సరిత, కవిత, కరుణ, నాగార్జున, గొట్టే నాగమణి, శ్రీను, ప్రకాష్, వీరాంజనేయులు, జానీ, విజయలక్ష్మి, నాగేశ్వరి , స్వాతి తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin