సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ధాన్యం కొనుగోలు గురించి మన హుజూర్ నగర్ పట్టణ కేంద్రంగా అనేక సంవత్సరాలుగా ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు బస్తా ఒక్కంటికి రెండు కేజీల ధాన్యం తగ్గించి లెక్క చేయడం, దీనికి వ్యతిరేకంగా రైతు కూలీ సంఘాలు, వామపక్షాలు, అనేకసార్లు మిల్లర్లతో చర్చించినారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. ఈ సమస్యపై అనేకసార్లు వీధి పోరాటాలు, అధికారులతో జాయింట్ సమావేశాలు నిర్వహించిన సమస్య మాత్రం అపరిచికృతంగానే మిగిలిపోయింది. గత పది సంవత్సరాలుగా ఈ సమస్యపై రైతు సంఘాలు పోరాడుతూనే ఉన్నాయి. గత సంవత్సరం ఈ సమస్యపై స్థూలంగా ఒక అంగీకారానికి వచ్చిన అమలు చేయడంలో జాప్యం జరిగింది. ఈ సంవత్సరం వరి కోతలు ప్రారంభం అవుతున్నందున ఇట్టి విషయాన్ని రైతు సంఘాల ప్రతినిధులతో చర్చించి విషయాన్ని. క్వింటాళ్లలో ఖరీదు చేయడాన్ని అఖిలపక్ష రైతు సంఘాల తో చర్చించాలని కోరినాయి. ఈ విషయమై రైస్ మిల్లర్ల ప్రతినిధులు స్పందిస్తూ రైతు సంఘాలు మా దృష్టికి తెచ్చినటువంటి విషయాన్ని మా సంఘం సమావేశంలో చర్చించి మీ సంఘాలకు కబురు చేస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, అనేక సంవత్సరాలుగా పరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యను వెంటనే పరిష్కరించాలని లేకపోతే వేలాదిమంది రైతులతో హుజూర్ నగర్ నడిబొడ్డు లో ధర్నా . రాస్తారోకో చేపడతామని ఈ విషయాన్ని అధికారులు దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోయి సమస్య పరిష్కారం అయ్యేంతవరకు పోరాడుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు మేకల నాగేశ్వరరావు, కొప్పోజు సూర్యనారాయణ, దుగ్గి బ్రహ్మం, కంబాల శ్రీనివాస్, కాకి అజయ్, టీజేఎస్ నియోజకవర్గ కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి, మురళి, బిక్షం, పూర్ణచంద్రరావు, నర్సిరెడ్డి రైస్ మిల్లు యాజమాన్యం నుండి అధ్యక్షులు పోలిశెట్టి నరసింహారావు సీనియర్ నాయకులు గెల్లి అప్పారావు, గజ్జి ప్రభాకర్, దొంగరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin