సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : జాతీయ నులిపురుగుల వ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా లింగగిరి ఉన్నత పాటశాల నందు ఎంపీపీ గూడేపు శ్రీనివాస్ మరియు మండల వైద్యాధికారి డా,సన ఆల్ బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన పిల్లల కోసం ఆల్బెండజోల్ మాత్రలను మింగించడం వలన పిల్లల్లో నులిపురుగులు రాకుండా నియంత్రించవచ్చని పిల్లల శారీరక మానసిక ఎదుగుదలకు ఆల్బెండజోల్ మాత్రలు ఉపకరిస్తాయని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సి హెచ్ ఓ పద్మ, పి ఎన్ హెచ్. నూర్జహాన్,Heo ప్రభాకర్, విజయలక్ష్మి మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
-----------------------
Admin