Monday, 14 September 2026 06:57:47 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సుప్రీం కోర్టులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు...

Date : 27 August 2024 02:29 PM Views : 635

సర్కార్ టీవీ న్యూస్ / ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. కేసుపై సుదీర్ఘంగా జరిగిన వాదనల అనంతరం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందు కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. కవిత ఈడీ కేసులో 5 నెలలుగా జైల్లో ఉన్నారని.. సీబీఐ కేసులో 4 నెలలుగా జైల్లో ఉన్నారని తెలిపారు. ఈ కేసులో ఎలాంటి రికవరీ లేదన్నారు. ఈ కేసులో రూ. 100 కోట్లు చేతులు మారాయన్నది కేవలం ఆరోపణలు మాత్రమే అని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. PMLAలోని సెక్షన్ 45 ప్రకారం ఆమెకు బెయిల్ పొందే అర్హత ఉందని వాదించారు.... ఈ కేసులో ఆమె ఎవరినీ బెదిరించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేసులో నిందితులంతా అప్రూవర్లుగా మారిపోయారని.. ఒక్కొక్కరు ఐదు స్టేట్‌మెంట్లు ఇచ్చారని కోర్టుకు తెలిపారు. నిందితులంతా అప్రూవర్లుగా మారి బెయిల్‌ పొందుతున్నారన్నారు. ఈడీ వాదనలపై రోహత్గీ అభ్యంతరం చెప్పారు. ఈడీ చెబుతున్న అప్రూవర్ సాక్ష్యాలను కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌లోనూ చెప్పారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కానీ కేజ్రీవాల్‌కు బెయిల్ వచ్చిందన్నారు.కవిత కేసులో ED తరపున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ SV రాజు వాదనలు వినిపించారు. ED నోటీస్‌ రాగానే ఫోన్లను ధ్వంసం చేసి ఫార్మాట్‌ చేశారని SV రాజు కోర్టుకు విన్నవించారు. ఫార్మాట్‌ చేసిన ఫోన్లను ఇంట్లో పనివాళ్లకు ఇచ్చారని.. ఆధారాలను కవిత తారుమారు చేశారన్నారు. ఈ పరిస్థితుల్లో ఆమెను బెయిల్‌ ఎలా ఇస్తారని ప్రశ్నించారు... దర్యాప్తునకు కవిత సహకరించలేదని SV రాజు వాదించారు. ఫోన్లో సమాచారం ఎక్కువైనపుడు డిలీట్‌ చేస్తాంగానీ ఫార్మాట్‌ చేయడం సహజం కాదన్నారు. కవిత ఫోన్‌లో 10 రోజుల డేటా మాత్రమే రికవర్‌ అయ్యిందన్నారు. కవిత ప్రవర్తన ఫోన్లో ఆధారాన్ని ధ్వంసం చేయడమే అన్నారు. సమాచారాన్ని ధ్వంసం చేయకపోతే కవిత.. ఇతర నిందితులతో జరిపిన సంభాషణ గురించి తెలుసుకోవచ్చని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: