Sunday, 13 September 2026 03:06:10 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అంబేద్కర్ భవన నిర్మాణానికై కలెక్టర్ కు వినతి...

Date : 31 October 2022 11:32 PM Views : 530

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : అంబేద్కర్ విగ్రహం,భవన నిర్మాణానికై కనీసం150 సెంట్లు స్థలం కేటాయించాలని కలెక్టర్ కు వినతి ,SC, ST, VMC, మాలమహానాడు నాయకులు, PTP, SSS జిల్లా శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి నందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు, భవన నిర్మాణానికి కనీసం రెండు ఎకరాలు స్థలాన్ని కేటాయించాలని స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ కు ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, విశ్వమాల మహానాడు, మాల మహాసభ సంఘాల నాయకులు కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా శ్రీసత్యసాయి జిల్లా SC, ST విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు గంగులయ్య నరసింహమూర్తి , శ్రీనివాసులు మాట్లాడుతూ గతంలో ఇదే కలెక్టర్ గారికి జిల్లా కేంద్రమైన పుట్టపర్తి లో అంబేద్కర్ విగ్రహం ,భవన నిర్మాణానికి కనీసం 150 సెంట్లు స్థలాన్ని కేటాయించాలని స్పందన కార్యక్రమాల్లో అర్జీలు సమర్పించామని తెలిపారు. దీనికి స్పందించిన కలెక్టర్ 25 సెంట్ల స్థలాన్ని మాత్రమే కేటాయించారని కృతజ్ఞతలు తెలిపారు. కానీ పుట్టపర్తి జిల్లా కేంద్రంగా అభివృద్ధి చెందుతూ నాలుగు వరసల జాతీయ రహదారి కూడా దీనిపై వెళ్లడం సంతోషకరమని పేర్కొన్నారు. అయితే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో భవిష్యత్తులో జనాభా పెరుగుదలను, జయంతోత్సవాలను దృష్టిలో ఉంచుకొని కలెక్టర్ కేటాయించిన 25 సెంట్ల స్థలం చాలదని సూచించారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కుల సంఘాల , రాజకీయ నాయకుల సమావేశాల నిమిత్తం మరిముఖ్యంగా జిల్లాలోని దళితుల కార్యక్రమాలకు ఈ స్థలంలో ఎటువంటి సదుపాయాలు సమకూర్చలేమన్నారు. కావున కలెక్టర్ మాపై దయవుంచి ఆ స్థలాన్ని పునః పరిశీలించి అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు,కళ్యాణ మండపానికి దాదాపు 150 సెంట్లు స్థలాన్ని కేటాయించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వమాల మహానాడు అధ్యక్షులు సానిపల్లి కేశవప్ప గుట్టూరు నాగరాజు , మాల మహాసభ అధ్యక్షులు ఈశ్వరయ్య ,చిన్న నాగప్ప ,మాల కమ్యూనిటీ నాయకులు నాగేంద్ర, లేపాక్షి గంగాధర్ , బసంపల్లి మల్లికార్జున , మల్లేష్ , ఎర్రి స్వామి రాము , వెంకటేష్ , నాగరాజు , తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: