సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ పట్టణంలో ప్రతిపక్ష, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరగనున్న లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణంపై మహదర్నా కార్యక్రమం విజయవంతం చేయాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ మహమ్మద్ ఇబ్రహీం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల హాజరు అవుతారని తెలిపారు. పార్టీలకు అతీతంగా లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలంటూ షాద్ నగర్ పట్టణంలోని ఎంపిడిఓ కార్యాలయం ఆవరణలో చేపట్టబోయే మహాధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ హార గోపాల్ తో పాటు ప్రముఖులు హాజరుకాబోతున్న నేపథ్యంలో మరో ముఖ్య అతిథిగా వైఎస్సార్టిపి అధినేత్రి వైఎస్ షర్మిళ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు వెల్లడించారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పురుడు పోసుకోవడం, కాలక్రమేణా మరుగున పడటం జరిగిందని తండ్రి ఆశయ సాధనలో షర్మిలమ్మ భాగస్వామ్యం కావడం ప్రభుత్వం లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణంలో అలసత్వాన్ని నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపడుతున్న ధర్నా కార్యక్రమంలో పాల్గొని ప్రజా సంక్షేమానికి పాటుపడటం తమకు తమ పార్టీకి శుభ పరిణామం అని ఆయన పేర్కొన్నారు.
-----------------------
Admin