సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : గత 26 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల,ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించి,పరిష్కారం చేయాలని,లేని యెడల సమ్మె ని ప్రజా ఉద్యమంగా మార్చాల్సి వస్తుందని CPM,CPI,CPI ML,ప్రజా పందా,CPI ML న్యూ డెమోక్రసీ రాష్ట్ర,జిల్లా నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమ్మె సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో గ్రామ పంచాయతీ కార్మిక,ఉద్యోగులు నవభారత్ నుండి కలక్టర్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు.అనంతరం గ్రామ పంచాయతీ కార్మికుల,ఉద్యోగుల జిల్లా జె.ఎ.సి చైర్మన్ ఎ.జె.రమేష్ అధ్యక్షతన జరిగింది. కార్మిక పోరాటాలలో ఎర్ర జెండా పెనవేసుకు పోయింది. కునంనేని సాంబశివరావు,CPI రాష్ట్ర కార్యదర్శి. ఎర్ర జెండా పుట్టిన దగ్గరనుండి కార్మిక పోరాటాల్లో, సమ్మెలో పెనవేసుకుపోయి పోయిందని,ఎర్ర జెండాలు,కార్మిక వర్గానికి ఉన్న బంధం పేగు బందమని CPI రాష్ట్ర కార్యదర్శి కునంనేని సాంబశివరావు అన్నారు.కార్మిక వర్గానికి సమ్మెలు కొత్తవి కావని,సమస్య పరిష్కారానికి సమ్మె చిట్ట చివరి ఆయుధమని కునంనేని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రాష్ట్ర JAC ని చర్చలకు పిలిచి సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో లో ఎర్రజెండాలు అన్ని కలిసి కార్మిక సమ్మె ని ప్రజా ఉద్యమంగా మారుస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్మికులు కాళ్ళు కడిగినా,సఫాయి అన్నా సలాం అన్నా కార్మికుల కడుపు నిండదు. పొతినేని సుదర్శన్ రావు,CPM రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. కేంద్రం లో ఉన్న నరేంద్ర మోడీ పారిశుధ్య కార్మికుల కాళ్ళు కడిగి,తుడిచినా,సఫాయి అన్నా నీకు సలాం ఆని కేసీఆర్ అన్నా కార్మికుల కడుపు నిండదని, వేతనాలు పెంచి,ఉద్యోగ భద్రత కల్పిస్తెనే కడుపు నిండుతుందని పోతినెని సుదర్శన్ అన్నారు. కేంద్ర,రాష్ట్ర పాలకులు ఎన్నికల ప్రయోజనం కోసం,ఓట్ల కోసం కార్మికుల మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తారని,ప్రచారం కోసం చేసే పని,చెప్పే మాటలు తప్ప మరొకటి కాదని అన్నారు.దేశం లోనే పారిశుధ్యం లో గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక అవార్డులు మన రాష్ట్రానికి వచ్చాయంటే కార్మికుల పాత్ర,కృషి లేకుందా సాధ్యమే కాదన్న విషయం ప్రభుత్వం విస్మరిస్తున్నాదని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వానికి అనేక మార్లు కార్మికుల సమస్యలపై రాయబారాలు చేసినా పట్టించికోపోయేసరికి సమ్మె లోకి వెళ్లాల్సి వచ్చిందని అన్నారు.ఈ రోజు జరిగే క్యాబినెట్ సమావేశం లో మొదటి ఎజెండా గా గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె డిమాండ్ల పై చర్చ జరిపి పరిష్కరించాలని సుదర్శన్ డిమాండ్ చేశారు. కార్పొరేట్ల పై ఉన్న ప్రేమ కార్మికులపై లేని BRS ప్రభుత్వం... -కెచ్చెల రంగారెడ్డి,CPIML ప్రజా పంథా జిల్లా కార్యదర్శి రాష్ట్రం లో గత 26 రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికుల కంటే కార్పొరేట్ల పైననే ప్రభుత్వానికి ప్రేమ ఉన్నదని,ఈ నిర్లక్ష్యాన్ని వదిలి రాష్ట్ర JAC ని చర్చలకు పిలవాలని రంగారెడ్డి డిమాండ్ చేశారు. కార్మిక సమస్యలను విస్మరిస్తే ప్రభుత్వ పతనం తప్పదు. అవునురి మధు,CPI ML న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె డిమాండ్ల పరిష్కారం పైన దృష్టి పెట్టని ప్రభుత్వాన్ని కార్మికులు చూస్తూ ఊరుకోరని,సమయం వస్టే ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపుతారని అవునురు మధు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.గత అనేక సమ్మెలలో రాష్ట్ర ప్రభుత్వం ఇదే ధోరణిని ప్రదర్శిస్తుందని అన్నారు.కార్మికులు కర్రు కాల్చి వాత పెడతారని మధు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కరోనా కాస్త కాలం లో ప్రజల ప్రాణాలు కాపాడిన గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వ వివక్ష విడనాడాలి. యల్.విశ్వనాథం,CPI ML జిల్లా కార్యదర్శి. కరోనా సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడటం లో ప్రాణాలకు తెగించి పని చేసిన కార్మికులు వేతనాలు పెంచమని,పర్మినెంట్ చేయమని అడుగుతుంటే సమ్మె విరమించి వస్తే పరిష్కారం ఆలోచిస్తామని అనడం విడ్డూరంగా ఉందన్నారు. ధర్నా అనంతరం జిల్లా కలక్టర్ శ్రీమతి ప్రియాంక అల కి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి ప్రయత్నిస్తానని కలక్టర్ JAC బృందానికి హామీ ఇచ్చారు. రేపటి నుండి సమ్మె యధావిధిగా కొనసాగుతుంది. జిల్లా JAC నేతల ప్రకటన. రాష్ట్రం లో,జిల్లా లో వచ్చిన వరదలు,వర్షాల కారణంగా ప్రజలను దృష్టిలో ఉంచుకుని పారిశుధ్య కార్యక్రమాలను ఈ నెల 29,30 తేదీలలో నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని సహాయ కార్యక్రమాలు చేశామని,ఆగస్ట్ 1 నుండి సమ్మె యధాతధంగా కొనసాగుతుందని,ఎక్కడా కార్మికులు పని చేయవద్దని,ఎక్కడైనా పోటీ కార్మికులను తీసుకువచ్చి పని చేయిస్తే అడ్డుకోవాలని జిల్లా JAC చైర్మన్ ఎ.జె.రమేష్,ప్రధాన కార్యదర్శి యండి.యూసఫ్ లు ధర్నా కి హాజరైన కార్మికులకు పిలుపునిచ్చారు. ఇంకా సభలో మాజీ శాసన సభ్యులు గుమ్మడి నరసయ్య,CPM జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య,CPI జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా,CITU జిల్లా అధ్యక్షులు కొలగాని బ్రహ్మచారి,AITUC జిల్లా కార్యదర్శి గుత్తుల సత్యనారాయణ,IFTU జిల్లా కార్యదర్శి యాకూబ్ష్ షా వలి,IFTU జిల్లా అధ్యక్షులు సారంగపాణి లు హాజరై సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రామ పంచాయతీ కార్మికుల,ఉద్యోగుల JAC ప్రధాన కార్యదర్శి యండి.యూసఫ్,రాష్ట్ర JAC కన్వీనర్లు మధుసూధన్ రెడ్డి,జగతి వెంకన్న,జిల్లా కన్వీనర్లు జాడి సురేష్, నరాటి వెంకటేశ్వర్లు, నాగరాజు,గొర్రెపాటి బసవయ్య, గోపాల్ రావు, కో కన్వీనర్ లు సాయి రత్న,దుంపల అమర్నాథ్, గడ్డంనాగరాజు,నల్లమోతు పూర్ణ చందర్ రావు,వెంకన్న,కమిటీ సభ్యులు కాపుల రవి,సలీం, కుర్శం జయ,నీలం భాస్కర్,ముత్తయ్య,దొంతుల సత్యం, ఇట్టిబోయిన శ్రీకాంత్,సామ్యేల్,రామారావు, సరికొండ నాగేశ్వర్ రావు,నరసింహారావు,రహమత్ ఖాన్,CITU జిల్లా ఉపాధ్యక్షులు దొడ్డ రవి కుమార్, సహాయ కార్యదర్శి డి వీరన్న,AITUC గ్రామ పంచాయతీ యూనియన్ గౌరవ అధ్యక్షులు వాసిరెడ్డి మురళి,రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నవారపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin