సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండలం,డబురు వారి పల్లి పంచాయతీ,దిగువపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బేల్దారి శంకరప్ప నిన్నటి రోజున అకస్మాత్తుగా మరణించిన సందర్భంగా ఆ విషయం తెలుసుకొని తన స్వగ్రామం నందు పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సామకోటి అదినారాయణ అనంతరం వారి కుటుంబానికి పెద్దదిక్కు కోల్పోయారని,ప్రగాఢ సానుభూతిని తెలియజేసి,వారి కుటుంబానికి తీరని లోటు వారు ఏ లోకానున్న వారి ఆత్మకు శాంతి చేకూరాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి జెరిపిటి అంజనప్ప, టిఎన్ టియుసి నియోజకవర్గ అధ్యక్షులు నిజాం వలి, జెరిపిటి ప్రసాద్ ,డాక్టర్ కిష్టప్ప,నారాయణప్ప,శివ,పీట్ల రమణ,తదితరులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
-----------------------
Admin