Monday, 14 September 2026 10:09:37 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జాతీయ నులిపురుగుల అవగాహన సదస్సు...

Date : 16 July 2023 05:41 AM Views : 450

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : ఫరూఖ్ నగర్ మండల్ ఎంపీడీవో ఆఫీసులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చించోడు విద్యాధికారి డాక్టర్ స్రవంతి ఆధ్వర్యంలో ఫరూఖ్ నగర్ మండల్ లోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ప్రైవేటు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు జాతీయ నులిపురుగుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈనెల 20వ తారీకు గురువారం రోజున జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్భంగా 1 సంవత్సరం నుండి 19 సంవత్సరాలు లోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రను మింగించాలని ఉపాధ్యాయులు అందరికీ తెలియజేశారు. ఈ ఆల్బెండజోల్ టాబ్లెట్ ఒకటి నుండి రెండు సంవత్సరముల మధ్య వయస్సు పిల్లలకు ఆఫ్ టాబ్లెట్ క్రష్ చేసి పిల్లలకు మింగించాలని, రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరముల వయస్సు వున్న పిల్లలు కు ఆల్బెండజోల్ ఒక టాబ్లెట్ నోట్లో నమిలించి మ్రింగించాలని చెప్పారు. 3 సంవత్సరం నుంచి 19 సంవత్సరంలో పిల్లలందరికీ కూడా ఒక ఆల్బెండజోల్ టాబ్లెట్ మ్గించాలని తెలియజేశారు. ఈ ఆల్బెండజోల్ టాబ్లెట్ మింగించడం వలన పిల్లల కడుపులోని నులిపురుగులు చనిపోయి పిల్లలు మానసికంగా, శారీరకంగా అభివృద్ధి చెందడానికి దోహదపడతాయని తెలియజేశారు. పిల్లల కడుపులో నులిపురుగులు ఉండడం వలన వారు తీసుకున్న హారము ఆ నులిపురుగులే భుజించడం వలన పిల్లల ఎదుగుదల తగ్గి, పిల్లలు మానసికంగా, శారీరకంగా ఎదుగుదలను కోల్పోతున్నారు అని చెప్పారు. అందువలన 20వ తారీకు గురువారం రోజున 1 సంవత్సరం నుండి 19 సంవత్సరంలో పిల్లలందరికీ కూడా ఒక ఆల్బెండజోల్ మాత్రం తప్పకుండా మింగించాలి అని డాక్టర్ స్రవంతి గారు తెలియజేశారు. 20వ తారీకు రోజున మిస్సయిన పిల్లలందరినీ మళ్లీ 27వ తారీకు రోజున ఆల్బెండజోల్ మాత్ర తప్పకుండా మింగించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫరూఖ్ నగర్ మండల్ ఎంఈఓ శంకర్ రాథోడ్, హెల్త్ ఎడ్యుకేటర్ జే శ్రీనివాసులు, ఎంఎల్ హెచ్ పి వైద్యాధికారులు, హెల్త్ సూపర్వైజర్లు, ఫరూఖ్ నగర్ మండల్ సంబంధించిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: