సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : రాజకీయాలలో పాతతరం నాయకులు ఉండడం వల్లే మూసధోరణిలో కొత్తగూడెం అభివృద్ధి మూలనపడిందని బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్ధి అడ్వకేట్ యెర్రా కామేష్ ఆరోపించారు.మన కొత్తగూడెం-మన కామేష్ కార్యక్రమంలో భాగంగా ఆయన శుక్రవారం లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని ఎంజీ రోడ్డు నుంచి ప్రచారాన్ని కొనసాగించారు.ఈ సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాపు యజమానులతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ప్రచారాన్ని కొనసాగించారు.అనంతరం కామేష్ మాట్లాడుతూ ఎక్కడైనా నేషనల్ హైవే పనులు చేపడితే సంవత్సర కాలంలోనే అవి పూర్తవుతాయని తెలిపారు.కానీ కొత్తగూడెం పట్టణానికి మాత్రం నేషనల్ హైవే మంజూరై పది సంవత్సరాలు అవుతున్న పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆరోపించారు.ఇంకెన్నాళ్లకు నేషనల్ హైవే పనులు పూర్తవుతాయో నేషనల్ హైవే అథారిటీ అధికారుల వద్ద కూడా సమాధానం లేదని అన్నారు.ఇక్కడ ఉన్న గత నాయకులకు,ప్రస్తుత అధికార పార్టీ నాయకుల మధ్య నెలకొన్న పర్సెంటేజీల పంచాయతీల వల్లే పనులు ముందుకు సాగడం లేదని ఆరోపించారు.కొత్తగూడెం పట్టణ,లక్ష్మీదేవిపల్లి ప్రజల కోరిక మేరకు నిర్మాణం తలపెట్టిన ముర్రేడు బ్రిడ్జి రెండవ లైన్ పనులు సైతం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నాయి తప్ప పూర్తికావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ముర్రేడు బ్రిడ్జి నుంచి భారీ వాహనాలు వెళ్లే సమయంలో బ్రిడ్జి కుదుపునకు గురవుతుందని తెలిపారు.ఒకవైపు నేషనల్ హైవే పనులు చేపట్టకపోవడం, మరోవైపు ముర్రేడ్ బ్రిడ్జి రెండవ లైన్ పనులు సంవత్సరాల తరబడి అదే పనిగా జరుగుతుండడం వల్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు.కాలం చెల్లిన నాయకుల వల్ల కొత్తగూడెంకు ఓనగూరేది ఏమీ లేదని స్పష్టం చేశారు.కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధి విషయంలో బీఎస్పీ పార్టీకి స్పష్టమైన అవగాహన ఉందని,అందుకు తగిన ప్రణాళికను సైతం రూపొందించిందని అన్నారు.ఒక్కసారి బీఎస్పీ పార్టీని గెలిపిస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని హామీ ఇచ్చారు.రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గ అభ్యర్థిగా నిలబడిన తన ఏనుగు గుర్తుపై ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు,సాయి, జిల్లా కార్యదర్శి మాలోత్ వీరు నాయక్,అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్,చేరికల కమిటీ చైర్మన్ గుడివాడ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin