Monday, 14 September 2026 12:55:07 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

శ్రీమతి మీనాక్షమ్మ గారి నాల్గవ వర్ధంతి సందర్భంగా స్కూల్ బ్యాగులు, విద్యా సమగ్రి పంపిణీ...

Date : 17 December 2022 12:00 AM Views : 568

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి లో శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రష్టి, శ్రీ రత్నాకర్ గారి మాతృమూర్తి శ్రీమతి మీనాక్షమ్మ గారి నాలుగో వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున వారి సమాధి వద్ద పుష్పాలతో నివాళులర్పించారు. మాజీ మంత్రివర్యులు శ్రీ పల్లె రఘునాథ్ రెడ్డి గారితో పాటు, అధికార పక్ష ప్రజాప్రతినిధులు శ్రేయోభిలాషులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీడుపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ సందర్శించిన శ్రీ రత్నాకర్, తమ మాతృమూర్తి వర్ధంతి సందర్భంగా బీడుపల్లి ప్రభుత్వ హైస్కూల్లోలో చదువుతున్న 250 మంది బాల బాలికలకు రత్నాకర్ తమ చేతుల మీదుగా స్కూల్ బ్యాగులు, విద్యా సమగ్రి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలు తమ తల్లిదండ్రులను సేవించడం, పూజించడం చిన్నతనం నుంచి నేర్చుకోవాలని చెప్పారు. పేదరికం అనుభవిస్తునా, చదువు అనే ఆయుధంతో పేదరికాన్ని జయించి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా వారు పిల్లలకు పిలుపునిచ్చారు. శ్రీ సత్య సాయి జిల్లా పాఠశాల ప్రాంగణాలలో మౌలిక వసతులు ఏవైనా ఏర్పాటు చేయవలసి ఉంటే తమ దృష్టికి తేవాలని ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యాన్ని వారుకోరారు. తమ పాఠశాలను సందర్శించి పిల్లలకు ఎంతో ఆనందాన్ని ప్రోత్సాహాన్ని ఇచ్చినందుకు ఈ సందర్భంగా బీడుపల్లి హై స్కూల్ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు రత్నాకర్ ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ రహమతుల్లా , శ్రీ రమణ , శ్రీమతి రాజేశ్వరి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: