Wednesday, 29 July 2026 01:38:31 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

దళితులపై దాడులు ఆపై కేసులు... అక్రమ కేసులను వెంటనే తొలగించాలి

Date : 21 October 2024 10:23 AM Views : 353

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : చిలుకూరు మండలం, బేతవోలు గ్రామంలో దసరా పండుగ రోజు కనకదుర్గమ్మ గుడి దగ్గర దళితులపై జరిగిన దాడులను ఖండిస్తున్నట్లు ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కన్వీనర్ కొండమీది శ్రీనివాస్ అన్నారు.అధికార పార్టీ అండతో దళితుల పైన అక్రమ కేసులను బనయించడం సరైనది కాదని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దసరా పండుగ రోజు కనకదుర్గమ్మ గుడిలో ఉద్దేశపూర్వకంగా దళితులు, అమాయకులపై దాడులు చేసి పైగా పోలీసు వారితో కేసులు పెట్టించడం సరైనది కాదని, రౌడీ షీటర్,పలు కేసులలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వట్టికూటి నాగయ్య అతని అనుచరులు దళితులను కనకదుర్గమ్మ గుడిలో దర్శనానికి వెళ్ళనీయకుండా అడ్డగించి కులం పేరుతో దూషించి,గుడి పక్కన ఉన్న పైపులతోను కర్రలతో ఇష్టానుసారంగా కొట్టినారు.చిలుకూరు మండలం పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, మఫ్టీ డ్రెస్ లో ఉన్న కోదాడ పట్టణ సీఐ రాము మరియు వట్టికూటి నాగయ్య అతని అనుచరులు సుమారు 40 మందిపైగా ఉన్న వారితో కలిసి దళిత పిల్లలపై మరియు కానిస్టేబుల్ వరకుమార్ కుటుంబం పైన అందున మహిళలు అని చూడకుండా ఇస్టానుసారంగా భూతు మాటలు తిడుతూ కొట్టడం జరిగిందని,అతి తక్కువ మంది ఉన్నా సుమారు ఐదు,ఆరు మంది దళితులపైన పోలీసు వారు మరియు వట్టికూటి నాగయ్య, అతని అనుచరులు కులం పేరుతో దూషిస్తూ కొట్టడం దారుణమని,ఆమానషమని,వట్టికూటి నాగయ్య మొదటి నుంచే నేర స్వభావం ఉన్న వ్యక్తి. గతంలో ఆయన దళితుల పైన దాడులు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయని,అప్పటి ఏట్రాసిటి కేసులలో అరెస్ట్ కాకపోవటం వలననే అతని అరాచకాలకు హద్దులేకుండా పోయింది. ప్రస్తుతం దళితుల పైన,అన్యాయాన్ని ప్రశ్నించే కానిస్టేబుల్ వరకుమార్ కుటుంబం పైన దాడులు చేసి పైగా కేసులు పెట్టి జైలుకు పంపించడం అన్యాయమని, ఈ విషయంలో పోలీసు ఉన్నతాదికారులు చొరవ తీసుకొని క్షేత్రస్తాయిలో న్యాయ విచారణ జరిపించి వారికి న్యాయం చేయాలని,మానవతావాదులు,ప్రజాస్వామికవాదులు ఈఅరాచకాలను ఖండించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి భాస్కర్, మొండి కత్తి అంబేద్కర్ అక్రమ కేసు బాధిత తల్లిదండ్రులైన రెమిడాల పిచ్చమ్మ, రెమిడాల బాబు, రెమిడాల పద్మ, రేమిడాల వెంకటి, నెమ్మాది మేరమ్మ,నెమ్మాది యేసు, వంగూరి రమేష్, రెడపంగు వీరయ్య, రేమిడాల బిక్షం, నెమ్మాది రవి, రాంపంగ కోటయ్య రెమిడాల కోటయ్య, రెమిడాలకోటమ్మ, గుండెపంగు రమణ బేతవోలు గ్రామ దళితులు తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :