సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : అమరచింత : విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చలో అసెంబ్లీ ముట్టడికి అమరచింత మండలం నుంచి భయలుదేరుతుండగా SFI జిల్లా సహాయ కార్యదర్శి కె రాఘవ, మండలం ఉపాధ్యక్షులు రమేష్ లను అమరచింత పోలీస్ స్టేషన్ లో అక్రమ అరెస్టు చేశారు. SFI మండల అధ్యక్షులు అవినాష్, ఉపాధ్యక్షులు వినయ్ చందు మాట్లాడుతూ... పోలీసుల అక్రమ అరెస్టులను ఖండించాలని అన్నారు. రాజ్యాంగ ప్రకారం ప్రతి విద్యార్థికి ప్రశ్నించే హక్కు ఉందని హక్కుల ప్రకారం ప్రశ్నించే గొంతును ఆపుతున్నారని అన్నారు. అరెస్టు చేసిన ఎస్ఎఫ్ఐ నాయకుల ను వెంటనే విడుదల చేయాలని కోరారు. అనంతరం SFI జిల్లా సహాయ కార్యదర్శి కె రాఘవ, మండల ఉపాధ్యక్షులు రమేష్ లు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం 6 నెలలు గడుస్తున్నా స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయడం లేదని చాలా మంది విద్యార్థులు స్కాలర్షిప్, రియంబర్స్మెంట్ మీద ఆధారపడి విద్యార్థులు చదువుకుంటున్నారని అలాంటిది స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం సరైనది కాదని వారు అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ఇప్పటివరకు మన రాష్ట్ర ప్రభుత్వం కేజీవీపీలో కానీ మోడల్ స్కూల్స్ కానీ ఒక్కరు కూడా టీచర్స్ లేని పరిస్థితి ఉన్నదని చాలామంది విద్యార్థులు ఉన్నత ర్యాంక్స్ లను కొట్టలేకపోతున్నారు. చాలామంది విద్యార్థులు చదువుకు దూరమైన పరిస్థితి ఉన్నదని ప్రవేట్ బడులకు వెళ్లడానికి మగ్గు చూపుతున్నారని తెలిపారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ప్రియంబర్స్మెంట్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే SFl ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరిన్ని పోరాటాలు చేస్తామని వారు హెచ్చరించారు.
-----------------------
Admin