Wednesday, 29 July 2026 11:07:38 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రాష్ట్రాన్ని అప్పుల కుంపటిగా మార్చారు... - టీపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్

Date : 31 July 2023 06:56 AM Views : 397

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : పరిపాలన సౌలభ్యం తెలియని పాలకుల చేతిలో తెలంగాణ రాష్ట్రం అప్పుల కుంపటిగా మారిందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ మండిపడ్డారు. ఆదివారం షాద్ నగర్ పట్టణంలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న పారిశుద్ధ కార్మికుల సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కాంట్రాక్టు బేసిక్ మీద పనిచేసే వారినీ అందరినీ రెగ్యులర్ చేస్తామని, కాంట్రాక్టు అనే పదమే ఉండదని మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత పాలకులు ఇచ్చిన హామీలను మర్చిపోయారని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాలతో పాటుగా పట్టణాల్లో పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవలు మరువలేరు అని ఆయన అన్నారు. చాలీచాలని జీతాలతో కాలం వెళ్లదీస్తున్నామని తమకు వేతనాలు పెంచాలని కోరుతూ కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న వారిని పట్టించుకున్న పాపాన పోవడం లేదన్నారు. కార్మికుల న్యాయపరమైన కోరిక నెరవేర్చే కొరకు వారు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి కి కనీసం ఆ శాఖపై అవగాహన కూడా లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పారిశుధ్య కార్మికుల కష్టాలు అర్థం చేసుకునే పరిస్థితి పాలకులకు ఎక్కడ ఉంటుందన్నారు. మున్సిపాలిటీల పరిధిలో పారిశుద్ధ్య కార్మికులు చేసే పనిని వేరే రాజకీయ నాయకులు ఎవరైనా చేయగలుగుతారా అని ప్రశ్నించారు. రాబోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని అధికారులకు వచ్చిన వెంటనే పంచాయతీ కార్మికులకు సరైన న్యాయం జరుగుతుందనీ హామీ ఇచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే పంచాయతీ కార్మికుల సమస్యను పరిష్కరించేందుకు కృషిచేసి సమ్మెను విరమింప చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సమ్మెలో పాల్గొన్న కార్మికులకు పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని తనవంతుగా వీర్లపల్లి శంకర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి మెంబర్ బాబర్ ఖాన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్, ఫరూఖ్ నగర్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, ఎంపీటీసీలు కొమ్ము కృష్ణ, కుమార్ గౌడ్, మైనార్టీ సెల్ హలీం, తుపాకుల శేఖర్, రాయికల్ శ్రీనివాస్, అన్నారం రఘు గౌడ్, వెంకటేష్ గౌడ్, రాఘవేందర్ గౌడ్, రాములు యాదవ్, మనోహర్ గౌడ్, ఎస్సీ సెల్ సాయిలు, అంజద్, హైదర్ గోరి, అప్ప రెడ్డి గూడా డిప్యూటీ సర్పంచ్ సీతారాములు, మల్లేష్, సురేష్,రాజు, నవీన్, లింగారెడ్డి గూడా సురేష్ గౌడ్, అశోక్, తుమ్మలపల్లి వెంకటయ్య, ముబారక్, కొండన్నగూడ సురేష్ గౌడ్,కిట్టు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: