Wednesday, 29 July 2026 05:15:57 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఉన్నత విద్య... 2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లకు చివరి తేదీ ఆగస్టు 31

Date : 28 August 2024 11:51 PM Views : 468

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందిస్తుందని డాక్టర్ బీఆర్ ఓపెన్ యూనివర్సిటి దృశ్య శ్రవణ మాధ్యమం పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రం డైరెక్టర్, డీన్ సామాజిక శాస్త్రం ఆచార్య శ్రీనివాస్ వడ్డాణం తెలిపారు.బీఆర్ఏఓయు అడ్మిషన్ ప్రక్రియ ప్రచారంలో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల స్టడీ సెంటర్ ను సందర్శించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అందరికీ నాణ్యమైన విద్య అందుబాటులో ఉందన్నారు.డిగ్రీ, పీజీ , డిప్లమో సర్టిఫికెట్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు తెలిపారు. ఈ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 31 లోగా ట్యూషన్ ఫీజు చెల్లించవచ్చని చెప్పారు.రెగ్యులర్ డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సులు చేయలేని విద్యార్థులకు, గృహిణులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారులకు, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలనుకొనే వారందరికీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓ వరమన్నారు. గత 44 సంవత్సరాలుగా అన్ని వర్గాల వారికి నాణ్యమైన విద్య ను అందిస్తుందన్నారు. యూనివర్సిటీ నాక్ - ఏ గ్రేడ్ ను కూడా సాధించిందని తెలిపారు.డిగ్రీ కోర్సులు సెమిస్టర్ సిస్టంలోను, పీజీ కోర్సులు ఇయర్వైజ్ స్కీంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంటాక్ట్ తరగతులతో పాటు స్టడీ మెటీరియల్ ను విద్యార్థులకు అందజేస్తున్నట్లు చెప్పారు. వివిధ వృత్తిలో పనిచేస్తూ కూడా ఓపెన్ వర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సులను పూర్తిచేసుకునే అవకాశం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని స్టడీ సెంటర్లలో ప్రవేశాలు పొందేందుకుగాను విద్యార్హతలు, ఫీజులు, కోర్సుల వివరాలను వెల్లడించారు. www.braouonline.in లేదా www.braou.ac.in వెబ్ సైట్ ద్వారా ప్రవేశాలు పొందవచ్చని పేర్కొన్నారు. యూజీ ద్వితీయ, తృతీయ సంవత్సరం, పీజీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఫీజు చెల్లించేందుకు కూడా ఈనెల 31 వరకు అవకాశం ఉందన్నారు. టీజీఎస్ పీఎస్, సివిల్స్ స్థాయి పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా పాఠ్యపుస్తకాలను రూపొందించినట్లు తెలిపారు.పూర్తి సమాచారం కోసం, సందేహాలుంటే సమీపంలోని అధ్యయన కేంద్రాల్లో సంప్రదించాలన్నారు. డిగ్రీ పూర్వ విద్యార్థులు రెండో, మూడో సంవత్సరంలో సకాలంలో ఫీజులు చెల్లించ లేకపోయిన వారు 2016-17 నుంచి 2023-24 వరకు, పీజీ ద్వితీయ సంవత్సరం 2023-24 వరకు గల పాత బ్యాచ్ల విద్యార్థులు కూడా ట్యూషన్ ఫీజులు చెల్లించవచ్చన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కంప్యూటర్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, సైన్ అండ్ టెక్నాలజీలలో పలు కోర్సులు రూపొందించినట్లు తెలిపారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఈ. సుధారాణి ఫోన్ ద్వారా అడ్మిషన్లు ప్రక్రియ గురించి వివరించారు. ఈ సమావేశంలో స్టడీ సెంటర్ కోఆర్డినేటర్, ఎస్వీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కెప్టెన్ డాక్టర్ వి.వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :